పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం.. వెండి రేటు ఏకంగా రూ.2వేలు పతనం..!

  • Publish Date - October 4, 2023 / 05:06 AM IST

విధాత‌: పసిడి ప్రియులకు శుభవార్త. బులియన్‌ మార్కెట్‌ పుత్తడి ధరలు భారీగా తగ్గాయి. బంగారం ధర రూ.660 వరకు తగ్గింది. 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.56,200 పలుకుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ తులానికి రూ.57,380 వరకు దిగివచ్చింది.


అదే సమయంలో వెండి కిలోకు రూ.2వేల వరకు పతనమైంది. ప్రస్తుతం కిలోకు రూ.71వేలకు దిగివచ్చింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.52,750 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.57,530కి తగ్గింది.


ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.52,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.57,380 పలుకుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.52,900 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.57,710కి చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.52,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.57,380 వద్ద ట్రేడవుతున్నది.


ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.52,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.57,380కి దిగివచ్చింది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. వెండి ధరల విషయానికి వస్తే కిలోకు రూ.2వేల వరకు దిగిరాగా.. కిలోకు రూ.71వేలు పలుకుతున్నది. హైదరాబాద్‌లో రూ.73,500కి తగ్గింది.