విధాత : మహారాష్ట్ర – రాయ్‌ఘడ్‌లోని మహద్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి వెలుతున్న శివసేన మహిళా నాయకురాలు సుష్మా అంధారే ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సుష్మా అంధారే, పైలట్ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అయితే హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సామాజిక మాద్యమాల్లో హెలిక్యాప్టర్ కూలిపోతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ప్రమాద స్థలంలో హెలిక్యాప్టర్ విడిభాగాలు పడిన తీరు ప్రమాద తీవ్రతను చాటాయి. అయితే ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద దృశ్యం చూసిన వారు గతంలో ఎన్నికల ప్రచారంలో హెలిక్యాప్టర్ కూలి సినీ నటి సౌందర్య మరణించిన ఘటనను గుర్తు చేసుకుంటున్నారు.
ఎన్నికల ప్రచారంలో కూలిన హెలిక్యాప్టర్.. తప్పిన ప్రాణ నష్టం
మహారాష్ట్ర - రాయ్‌ఘడ్‌లోని మహద్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి వెలుతున్న శివసేన మహిళా నాయకురాలు సుష్మా అంధారే ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది.

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు