MLC By Election In Telangana : ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సమరం

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిపోగా...ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమై జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. రాజకీయ పార్టీలు లోక్‌సభ ఎన్నికల పోరు నుంచి తేరుకోకముందే పక్షం రోజుల వ్యవధిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మల్సీ ఉప ఎన్నికలలో తలపడనున్నాయి.

  • Publish Date - May 14, 2024 / 04:57 PM IST

బరిలో 52మంది అభ్యర్థులు

విధాత : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిపోగా…ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమై జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. రాజకీయ పార్టీలు లోక్‌సభ ఎన్నికల పోరు నుంచి తేరుకోకముందే పక్షం రోజుల వ్యవధిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మల్సీ ఉప ఎన్నికలలో తలపడనున్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానంలో నామినేషన్ల ఉప సంహరణ ఘట్టం పూర్తవ్వగా, బరిలో 52 మంది అభ్యర్థులు నిలిచారు. మే 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 4.63లక్షల మంది పట్టభద్రులైన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

పోలింగ్ కోసం అధికార యంత్రాంగం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నమ, బీఆరెస్ నుంచి ఎనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆరెస్ జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడంతో ఆయన తన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. పల్లాపై గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్న ఈ దఫా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండటం విశేషం.

Latest News