JNUSU Election Results 2025 | జేఎన్‌యూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో దూసుకుపోతున్న వామపక్ష సంఘాలు

ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో అన్ని విభాగాల్లోనూ వామపక్ష విద్యార్థి సంఘాలు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించాయి. 11 ఏళ్ల విరామం తర్వాత బీపీఎస్‌ఏ (బిర్సా అంబేడ్కర్‌ పూలే స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవిని దక్కించుకున్నది. ఈ సంఘానికి చెందిన కోమల్‌దేవి.. స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ కౌన్సిలర్‌ సీటును గెలుచుకుంది.

JNUSU Election Results 2025 | ఢిల్లీలోని ప్రఖ్యాత జేఎన్‌యూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘాలు స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించాయి. ఈ వార్త రాసే సమయానికి (నవంబర్‌ 6, 2025 సాయంత్రం 5.46 గంటలు) ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నది. వామపక్ష కూటమికి చెందిన అదితి మిశ్రా అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతున్నారు. ఏబీవీపీ అభ్యర్థులు కార్యదర్శుల పోస్టులలో ఎదురొడ్డుతున్నారు. ఈ ఏడాది సుమారు 9వేల మంది విద్యార్థులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అంటే.. 67 శాతం ఓటింగ్‌ నమోదైంది. లెఫ్ట్‌ యూనిటీ అభ్యర్థులు.. అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పోస్టులు గెలుచుకునే దిశగా సాగుతున్నట్టు తాజా ఫలితాల సరళి చాటుతున్నది. 11 ఏళ్ల విరామం తర్వాత బీపీఎస్‌ఏ (బిర్సా అంబేడ్కర్‌ పూలే స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవిని దక్కించుకున్నది. ఈ సంఘానికి చెందిన కోమల్‌దేవి.. స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ కౌన్సిలర్‌ సీటును గెలుచుకుంది.