Actor arrest : ఒక హత్యకేసులో కర్ణాటకకు చెందిన ప్రముఖ నటుడు దర్శన్ తూగుదీప (Darshan Thugadeepa) అరెస్టయ్యారు. మంగళవారం మైసూరులో ఆయనతో పాటు మరో పదిమందిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం వారిని బెంగళూరుకు తరలించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 8న రేణుకాస్వామి అనే మహిళ హత్యకు గురైంది. ఆ మరుసటి రోజు కామాక్షిపాళ్యం సమీపంలోని ఒక కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. మృతురాలిది చిత్రదుర్గ అని తేలింది. ఈ కేసులో నటుడు దర్శన్‌పై ఆరోపణలు వచ్చాయి. విచారణలో భాగంగా నిందితుడు దర్శన్ పేరు వెల్లడించినట్లు పోలీసులు చెప్పారు.
నిందితుడితో నటుడు నిరంతరం టచ్‌లో ఉండేవాడని విచారణలో తేలింది. దాంతో దర్యాప్తు నిమిత్తం ఆయనను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. దర్శన్ భార్యకు రేణుకా స్వామి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు తెలిసింది. ఆ కక్షతోనే దర్శన్ ఆమెను హత్య చేయించాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.