బహిష్కరణ గొడవ తర్వాత లెన్స్‌కార్ట్ క్షమాపణలు.. బొట్టు, హిజాబ్, తిలకాలకు అనుమతి

సోషల్ మీడియాలో బహిష్కరణ రచ్చ తర్వాత లెన్స్‌కార్ట్ క్షమాపణలు చెప్పింది. కొత్త స్టైల్ గైడ్‌లో బొట్టు, హిజాబ్, తిలకం, టర్బన్ వంటి మతపరమైన అలంకరణలకు అనుమతి ఇచ్చింది.

Lenskart store apologises after controversy over employee religious symbols policy in India

నాటి పాలసీపై క్షమాపణలు చెప్పిన లెన్స్‌కార్ట్.. బొట్టు, హిజాబ్‌, తిలకాలకు గ్రీన్ సిగ్నల్

Lenskart Apologises After Online Fury, Allows Bindi, Hijab, Tilak In New Policy

హైలైట్ పాయింట్స్

  • వివాదాస్పద పాత పాలసీపై లెన్స్‌కార్ట్ క్షమాపణలు
  • బిండి, హిజాబ్, తిలక్, తుర్బన్‌కు అనుమతి
  • పీయూష్ బన్సల్ పాత డాక్యుమెంట్ అని వివరణ
  • భవిష్యత్తులో సమానత్వ పాలసీలు అమలు చేస్తామని హామీ

Lenskart Apologises | దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ప్రముఖ కళ్లద్దాల సంస్థ లెన్స్‌కార్ట్ చివరకు క్షమాపణలు చెప్పింది. ఉద్యోగుల కోసం వైరల్ అయిన ఒక పాత స్టైల్​ గైడ్​ విధాన పత్రంలో బొట్టు, మంగళసూత్రం​ వంటి హైందవ అలంకరణలపై ఆంక్షలు ఉన్నాయన్న ఆరోపణలు రావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. #BoycottLenskart ట్రెండ్ అయ్యే స్థాయికి గొడవ ముదిరింది. అందునా హిజబ్​ను అనుమతించి.. బొట్టు, తిలకాలపై నిషేధం విధించారన్న వార్తలు రావడంతో రచ్చ తారాస్థాయికి చేరింది.

దీంతో కంపెనీ తాజాగా కొత్త In-Store Style Guide విడుదల చేసింది. ఇందులో ఉద్యోగులు బొట్టు, తిలకం, సిందూర్, కలావా, మంగళసూత్రం, కడా, హిజాబ్, టర్బన్ వంటి మతపరమైన, సాంస్కృతిక అలంకరణలు  ధరించవచ్చని స్పష్టంగా ప్రకటించింది.

మా వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమించండి

వివాదం తర్వాత స్పందించిన లెన్స్‌కార్ట్ వ్యవస్థాపకుడు పీయూష్ బన్సల్

ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన లెన్స్‌కార్ట్, “మా పాత సమాచారం వల్ల ఎవరికైనా తమ విశ్వాసానికి ఇక్కడ విలువ లేదనే భావన కలిగిఉంటే మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం. అది లెన్స్‌కార్ట్ విధానం కాదు” అని తెలిపింది.

కంపెనీ మాట్లాడుతూ, భారత్‌లో పుట్టి, భారతీయులతో నిర్మించబడిన సంస్థగా ఉద్యోగుల సంప్రదాయాలను ఎప్పుడూ గౌరవిస్తామని చెప్పింది.

పీయూష్ బన్సల్ వివరణ

వివాదం చెలరేగిన వెంటనే లెన్స్‌కార్ట్ వ్యవస్థాపకుడు పీయూష్ బన్సల్ స్పందించారు. వైరల్ అయిన డాక్యుమెంట్ పాతదని, ప్రస్తుత విధానానికి, దానికీ సంబంధం లేదని స్పష్టం చేశారు.

“మా సంస్థలో ఎటువంటి మతపరమైన వ్యక్తీకరణపైనా నిషేధం లేదు. బొట్టు, హిజబ్​ వంటి వాటిపై ఆంక్షలు లేవు” అని పేర్కొన్నారు.

ఇకపై జాగ్రత్తగా విధాన నిర్ణయాలు

భవిష్యత్తులో కంపెనీ పేరుతో వెలువడే ప్రతి విధానం, శిక్షణా సామాగ్రి, సమాచారం.. అన్నీ సమానత్వం, గౌరవం, వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా ఉంటాయని లెన్స్‌కార్ట్ హామీ ఇచ్చింది.

Latest News