Viral Video | ప్రభుత్వ మీటింగ్ మధ్యలో అనుకోని అతిథి.. కలెక్టర్ కుర్చీలో కూర్చొని కోతి హంగామా!

Viral Video |ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పత్ కలెక్టరేట్‌లో మీటింగ్ సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సమావేశం మధ్యలో ఆడిటోరియంలోకి వచ్చిన ఓ కోతి కాసేపు కలెక్టర్ కుర్చీలో కూర్చొని హంగామా చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video | ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన ఓ మీటింగ్‌ సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రైతులతో కలెక్టర్ సమావేశం జరుగుతున్న సమయంలో అక్కడకు వచ్చిన ఓ కోతి (లంగూర్) నేరుగా కలెక్టర్ దగ్గరకు వెళ్లింది. అనుకోకుండా వచ్చిన ఈ అతిథిని చూసి కలెక్టర్ లేవగా.. అది వెళ్లి దర్జాగా ఆమె కుర్చీలో కాసేపు కూర్చొని హంగామా చేసింది. దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పత్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇటీవల రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అస్మితా లాల్, ఎస్పీ సూరజ్ కుమార్ రాయ్ రైతులతో సమావేశమయ్యారు. అన్నదాతల సమస్యల గురించి వారితో సీరియస్‌గా చర్చిస్తున్నారు. అదే సమయంలో ఓ కోతి డైరెక్ట్‌గా సమావేశం జరుగుతున్న ఆడిటోరియంలోకి ప్రవేశించింది. నేరుగా కలెక్టర్ టేబుల్ వద్దకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న పత్రాలను లాగేసింది. ఇది చూసి షాకైన పలువురు ఆఫీసర్లు కుర్చీల్లో నుంచి లేచి పక్కకు పారిపోయారు.

అనుకోని అతిథి ఎంట్రీతో అక్కడ ఉన్న అధికారులు, రైతులు భయపడిపోయారు. కానీ కలెక్టర్ మాత్రం ఏ మాత్రం భయపడకుండా ఆ కోతిని చిరునవ్వుతో ఆహ్వానించారు. అప్పుడు కోతి కలెక్టర్ అస్మితా లాల్ ముందు ఉన్న టేబుల్ వద్దకు వెళ్లింది. అప్పుడు కలెక్టర్ కుర్చీలో నుంచి పైకి లేచారు. ఆ కోతిని కూర్చోమని చెప్పడంతో అది టేబుల్‌పై కూర్చుంది. ఆ తర్వాత లేచి కలెక్టర్ కుర్చీలో కూడా కూర్చుని హంగామా చేసింది. ఇదంతా చూసిన సిబ్బంది, రైతులు ఆ దృశ్యాలను వీడియో తీశారు. అది కాస్త వైరల్‌గా మారింది.

ఇంతకీ ఆ కోతి ఎవరిదో కాదు.. కలెక్టర్ అస్మితా లాప్ పెంపుడు కోతినే అని సమాచారం. దాని పేరు మాతృ. ఎప్పుడూ అది కలెక్టరేట్ ఆవరణలోనే తిరుగుతుంటుందట. కలెక్టరేట్ సిబ్బందికి కూడా అది సుపరిచితమే అని తెలుస్తోంది. కాగా, మీటింగ్ మధ్యలో వచ్చిన కోతిని సిబ్బంది ఆడిటోరియం నుంచి తీసుకెళ్లడంతో అక్కడి వాతావరణం సద్దుమణిగింది. రైతుల సమావేశం సాఫీగా సాగింది.

Read More:

ఏలియన్ల రహస్యాలు అతి త్వరలో.. : ట్రంప్ తాజా సంచలనం

మీరేం తినాలో కూడా రోబోలే చెప్పేస్తాయి.. చైనాలో వైరల్‌గా ఏఐ వెయిటర్లు!

బైక్ తో రైలును లాగేందుకు యత్నం..వైరల్ గా వీడియో

Latest News