Chinese AI Restaurant | మీరేం తినాలో కూడా రోబోలే చెప్పేస్తాయి.. చైనాలో వైరల్‌గా ఏఐ వెయిటర్లు!
Chinese AI Restaurant | చైనా హాంగ్‌జౌ నగరంలోని ఓ ఏఐ రెస్టారెంట్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి కారణం ఇక్కడ పనిచేసే రోబో వెయిటర్లే. ఇవి సాధారణ వెయిటర్లలా ఆర్డర్లు తీసుకోవు.. మీ మొహాన్ని, నాలుకను స్కాన్ చేసి.. మీరు ఏం తినాలో చెబుతాయి.
Chinese AI Restaurant | సాధారణంగా రెస్టారెంట్‌కు వెళ్తే ఏం చేస్తాం.. ముందు ఫుడ్ మెనూ చూస్తాం.. తర్వాత ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో డిస్కస్ చేసి మనకు నచ్చిన ఫుడ్ ఐటెం ఆర్డర్ ఇస్తాం. కానీ చైనా హాంగ్‌జౌ నగరంలోని ఈ రెస్టారెంట్‌కు వెళ్తే మీరు ఏమీ ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదు.. ఇక్కడ ఉండే ఏఐ రోబో వెయిటర్లు మీ మొహాన్ని, నాలుకను చూసే మీకు ఏం కావాలో డిసైడ్ చేసేస్తాయి. వినూత్న టెక్నాలజీతో పనిచేస్తున్న ఈ రోబోలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.
ఈ రెస్టారెంట్‌లోకి ఎవరైనా కస్టమర్ రాగానే.. ముందుగా రోబో వెయిటర్లు అతని మొహాన్ని తీక్షణంగా పరిశీలిస్తుంది. తర్వాత నాలుకను స్కాన్ చేస్తుంది. కొన్ని ప్రశ్నలు అడిగి డేటా సేకరించిన అనంతరం వాటిని మొత్తం విశ్లేషించి.. కస్టమర్ ఆరోగ్య స్థితి, జీర్ణశక్తి, మూడ్‌ను అంచనా వేస్తాయి. దాన్ని బట్టి ఎలాంటి ఫుడ్ తినాలో డిసైడ్ చేస్తాయి. ముఖ్యంగా కస్టమర్ నాలుక, శరీర పరిస్థితికి అనుగుణంగా ఏ డిష్ తినాలో చెప్పేస్తాయి. ప్రస్తుతం ఆ రెస్టారెంట్‌లో సుమారు 8 రోబోలు పనిచేస్తున్నాయి.
ఈ రోబోలు కేవలం వెయిటర్లలో ఆర్డర్లు మాత్రమే తీసుకోవు. కుకింగ్ మాస్టర్‌లా వంటలు కూడా చేయగలవు. ఒక్కో రోబో 100కి పైగా వంటకాలు చేయగలే సామర్థ్యం కలిగి ఉన్నాయి. అలాగే సర్వింగ్, క్లీనింగ్ వంటి హోటల్‌లోని అన్ని పనులను ఇవి చేస్తాయి. కాగా, ఈ ఏఐ రోబోల కారణంగా 60 శాతం పనిభారం తగ్గినట్లు సమాచారం. దీనివల్ల ధరలు కూడా తగ్గాయని తెలుస్తోంది. గతంలో 20 యువాన్‌లు ఉన్న ఫుడ్.. ఇప్పుడు కేవలం 15 యువాన్లకే దొరుకుతుందట.
మొత్తమ్మీద కేవలం వెయిటర్లలా మాత్రమే కాకుండా.. డిజిటల్ న్యూట్రీషియన్లుగా పని చేస్తున్న ఈ రోబోలను చూసి కస్టమర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోబోలు తయారు చేసే ఆహారం రుచిలో కూడా మనుషులు తయారు చేసినట్లుగా అద్భుతంగా ఉంటున్నాయని కస్టమర్లు చెబుతున్నారు. మొత్తానికి హోటల్ నిర్వాహకుల ఖర్చులను తగ్గించడమే కాకుండా.. కస్టమర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారాన్ని సర్వ్ చేస్తున్న ఈ ఏఐ రోబోలు ఇప్పుడు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి.
Read More:
బైక్ తో రైలును లాగేందుకు యత్నం..వైరల్ గా వీడియో
పిల్లలు కావాలంటే నీ భార్యను నా వద్దకు పంపు : టీసీఎస్ నాశిక్ టీమ్ లీడ్ దారుణ వ్యాఖ్యలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram