బీచ్ లో ఆలల చెంత సింహం..ఫోటో, వీడియో వైరల్

సహజంగా అడవుల్లో, మైదానాల్లో తిరిగే సింహం… సముద్ర తీరంలో అలల మధ్య సేదతీరుతూ కనిపిస్తే ఎవరికైనా ఆశ్చర్యమే. అట్లాంటిక్ సముద్ర తీరం వెంబడి సముద్రపు అలలు ఒడ్డున ఉన్న రాళ్లను తాకుతున్న చోటనే ఒక ఆడ సింహం విశ్రాంతి తీసుకుంటూ కనిపించిన అరుదైన దృశ్యం వైరల్ గా మారింది. అయితే దీని వెనుక పెద్ద కథనే ఉంది.

విధాత : సహజంగా ప్రకృతి ఒడిలో..సముద్ర తీరం(బీచ్)లలో మనుషులు సేద తీరుతుండటం… సహజ ప్రకృతి అందాలకు పరవశిస్తుండటం చూస్తుంటాం. అయితే ఓ సివంగి(ఆడ సింహం)కి కూడా ఆడవి వాతావరణం బోర్ కొట్టిందేమోగాని..దట్టమైన అడవులు, మైదాన ప్రాంతాలను వదిలి సముద్రపు తీరానికి చేరింది. ఏకంగా సముద్రం అలలు తీరంలోని రాళ్లను తాకుతున్న చోట పడుకుని సముద్రపు కేరటాలను వీక్షిస్తూ …చల్లగాలులను ఆస్వాదిస్తూ సేద తీరింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటో వైరల్ గా మారింది. కాని ఆ సింహం అలా సముద్ర తీరం వద్ద ఎందుకు ఉందన్న దాని వెనుక పెద్ద కథనే ఉంది.

నమీబియా సముద్ర తీరం వెంబడి ఉన్న బీచ్ లోని రాళ్ల వరుసపై..సరిగ్గా సముద్రపు అలలు వచ్చి తాకుతున్న చోటనే ఒక ఆడ సింహం విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది. సింహం వెనుక భాగంలో సముద్రపు కేరటాలు ఎగిసిపడుతున్న దృశ్యం అద్బుతంగా కనువిందు చేస్తుంది. నమీబియాలో ఎడారి జీవితానికి అలవాటుపడిన సింహాలు..అక్కడి కరువుల కారణంగా ఇవి సముద్ర తీరాలకు వలస వచ్చి సీల్స్ వంటి సముద్రపు జంతువులను వేటాడుతుంటాయి. ఈ “సముద్రపు సింహాలు” సముద్ర తీరాలను ఆహారం కోసం వేటతో పాటు తమ అవాసాలుగా మార్చుకుంటుండటం పరిస్థితులను అనుసరించి తమ జీవన శైలులో చేసుకునే మార్పులకు నిదర్శనంగా చూడవచ్చని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు.

నమీబియా ఏడారి నుంచి 12 సింహాలు స్కెలెటిన్ పోస్టు ప్రాంతం నుంచి అట్లాంటిక్ సముద్ర తీరానికి వలస వచ్చాయి. తమ కొత్త ఆవాసంలో జీవించేందుకు ఆ సింహాలు తమ జీవన శైలీని మార్చుకున్నాయి. సముద్ర జీవులను వేటాడుతూ చెట్లు లేని ఇసుక దిబ్బలతో కూడిన తీర ప్రాంతంలో జీవించడం అలవాటు చేసుకున్నాయి. ఒక్కో సింహం ఒక్క రాత్రి 40కిపైగి సీల్స్ ను వేటాడే శక్తి నైపుణ్యం అలవర్చుకున్నాయి. ఆ సింహాల గుంపులో గామా అనే ఆడ సింహం తీర ప్రాంతంలో సీల్ ను వేటాడి.. సేద తీరుతుండగా బెల్జియం ఫోటో గ్రాఫర్ వామ్ మాల్ధేరియన్ దానిన వీడియో, ఫోటో తీసింది. ఈ ఫోటో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు సాధించింది..

కరవు, రైతులతో నెలకొన్న సంఘర్షణ నేపథ్యంలో 30ఏళ్ల తర్వాతా తిరిగి సముద్ర తీరానికి ఈ ఏడారి సింహాలు చేరుకుని అక్కడే కొన్నాళ్లుగా మళ్లీ తమ మనుగడ సాగిస్తున్నాయి. సముద్ర జీవులను వేటాడే నైపుణ్యం నమీబియా సింహాలకు మాత్రమే ఉందని..అందుకే వీటిని సముద్ర సింహాలు అని పిలుస్తుంటారని వన్యప్రాణి నిపుణులు వెల్లడించారు. పర్యావరణ మార్పులకు అనుగుణంగా నమీబియా సింహాలు కరువు పరిస్థితులలో మైదాన ప్రాంతాల నుంచి సముద్రతీర ప్రాంతాలకు చేరి జీవించడం అలవాటు చేసుకున్నతీరు స్ఫూర్తిదాయకం అని చెప్పడం విశేషం.

 

Latest News