తెలంగాణకు డబుల్ ట్రబుల్​.. పగలు మండే ఎండలు, సాయంత్రం గాలులు-వర్షాలు!

తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు 44°C వరకు మండే ఎండలు, సాయంత్రం ఉరుములు-గాలులు–వానలు, ఉంటాయని IMD హెచ్చరించింది. హైదరాబాద్ సహా అనేక జిల్లాలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

థర్మామీటర్‌పై అధిక ఉష్ణోగ్రతలు, పక్కనే ఉరుములు మెరుపులతో వర్షాన్ని సూచించే తెలంగాణ వాతావరణ గ్రాఫిక్

తెలంగాణలో విచిత్ర వాతావరణం.. 44 డిగ్రీల ఎండలు, సాయంత్రం వానలు

Double Trouble for Telangana: Scorching Heat and Evening Storms Till April 22

తెలంగాణకు డబుల్ అలర్ట్
  • రాష్ట్రంలో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు
  • ఏప్రిల్ 22 వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు
  • గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు
  • హైదరాబాద్ సహా అనేక జిల్లాలకు హెచ్చరిక

విధాత వెదర్​ డెస్క్​ | 19 ఏప్రిల్​ 2026 | హైదరాబాద్​:

Heatwave and Storms – Telangana | తెలంగాణ ప్రజలకు వచ్చే నాలుగు రోజులు విచిత్ర వాతావరణ పరిస్థితులు ఎదురుకానున్నాయి. భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా పగటిపూట తీవ్రమైన ఎండలు, సాయంత్రం ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఏప్రిల్ 22 వరకు ఈ పరిస్థితులు కొనసాగనున్నట్లు తెలిపింది.

44 డిగ్రీల కొలిమిలో మాడిపోనున్న తెలంగాణ

రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40°C నుంచి 44°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనుంది. అత్యవసర పరిస్థితులుంటే తప్ప బయటకు వెళ్లడం మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సాయంత్రం ఒక్కసారిగా గాలులు, వానలు

మధ్యాహ్నం మండే వేడి కారణంగా గాలి వేగంగా పైకి ఎగసి భారీ మేఘాలు ఏర్పడతాయి. ఈ వేడి గాలులు బంగాళాఖాతం నుంచి వచ్చే తేమ గాలులతో కలిసినప్పుడు సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచవచ్చు.

ప్రభావిత జిల్లాలు ఇవే

ఒకవైపు ఎండలు.. మరోవైపు ఉరుములు.. తెలంగాణకు డబుల్ షాక్​ : వాతావరణ హెచ్చరిక

తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్​, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలకు అప్రమత్తత హెచ్చరికలు జారీ అయ్యాయి.

ప్రజలకు సూచనలు

తెలంగాణలో వేసవి తన అసలు రూపం చూపిస్తుండగా, సాయంత్రం వానలు మరోవైపు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. ఈ కఠిన వాతావరణం ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండడం మంచిది.

Latest News