విధాత : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన ట్వీట్ నాకు ఎంతో బాధ కల్గించిందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. జైలులో చంద్రబాబు ప్రాణాలకు ముప్పుందని, ఆయనపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని లోకేశ్ శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు.
దోమలు, కలుషిత నీటితో ఇబ్బంది పడుతున్నారని, ఇన్‌ఫెక్షన్, అలర్జీతో బాధ పడుతున్నారని ట్వీట్‌లో పేర్కోన్నారు. లోకేశ్ ట్వీట్‌పై శుక్రవారం మీడియా చిట్‌చాట్‌లో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఒక కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో నాకు తెలుసని, కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో నాకూ తీవ్ర ఆందోళన కల్గిందన్నారు. హైద్రాబాద్ ప్రశాంతంగా ఉండాలనే బాబు అరెస్టుపై ఇక్కడ ఆందోళలు వద్దంటున్నామంటూ కేటీఆర్ తెలిపారు.