Site icon vidhaatha

Rahul Gandhi | అగ్ని వీరుడి కుటుంబానికి పరిహారంపై రాహుల్‌గాంధీ నిలదీత

పరిహారానికి, బీమాకు తేడా తెలియదా అంటూ కేంద్రంపై విమర్శలు

విధాత : విధి నిర్వహణలో అమరుడైన ‘అగ్నివీరుడు’ అజయ్ కుమార్ ఫ్యామిలీకి ఎలాంటి పరిహారం అందలేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారానికి, ఇన్సూరెన్స్ కు మధ్య తేడా ఉంటుందని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఓ వీడియోని షేర్ చేశారు. ప్రైవేటు బ్యాంక్ నుంచి 50 లక్షల రూపాయలు. ఆర్మీ గ్రూప్ ఇన్పూరెన్స్ ఫండ్ నుంచి రూ.48 లక్షలు అందినట్లు అజయ్ కుమార్ తండ్రి అందులో ఆయన చెప్పారు. ఇక, ఈ వీడియోని షేర్ చేస్తూ.. అమరవీరుడి కుటుంబానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ నుంచి పరిహారం లేదా ఎక్స్‌గ్రేషియా చెల్లింపులు జరగలేదన్నారు. పరిహారానికి, ఇన్సూరెన్స్ కు మధ్య వ్యత్యాసం ఉందని, అమరవీరుడి కుటుంబానికి బీమా కంపెనీ ద్వారా మాత్రమే చెల్లింపులు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.

అయితే, దేశం కోసం ప్రాణత్యాగం చేసే ప్రతి అమరవీరుడి కుటుంబాన్ని గౌరవించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కానీ మోదీ ప్రభుత్వం అమరవీరుల పట్ల వివక్ష చూపుతోందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఏం చెప్పినా ఊరుకునేది లేదని, ఇది దేశభద్రతకు సంబంధించిన అంశమన్నారు. పదే పదే ఈ సమస్యను లేవనెత్తుతానని స్పష్టం చేశారు. ఇకపోతే, రాహుల్ గాంధీ షేర్ చేసిన వీడియోలో.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి డబ్బులు రాలేదని అగ్నివీర్ అజయ్ కుమార్ తండ్రి చెప్పారు. అలాగే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు తన కుటుంబానికి క్యాంటీన్ కార్డు ఇప్పించాలన్నాడు. అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇచ్చామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ చెప్పారు.. కానీ, మాకు అలాంటి సహాయమేది రాలేదని అజయ్ కుమార్ తండ్రి వెల్లడించారు.

Exit mobile version