రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఎంఐఎం పోటీ.. పతంగి గుర్తు కేటాయించిన ఈసీ

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఎంఐఎంకు ఆ రెండు రాష్ట్రాల్లోనూ పతంగి గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది

విధాత : రాజస్థాన్‌, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసేందుకు రంగం సిద్ధమైంది. తెలంగాణలో గుర్తింపు పొందిన పార్టీగా పతంగి గుర్తును పొందిన ఎంఐఎంకు పార్టీ అధినేత ఒవైసీ అభ్యర్థన మేరకు ఆ రెండు రాష్ట్రాల్లోనూ కేంద్ర ఎన్నికల సంఘం అదే గుర్తును కేటాయించింది. ఇప్పటికే బీజేపీతో రహస్య అవగాహాన నేపధ్యంలోనే మైనార్టీల ఓట్లను చీల్చడం ద్వారా కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఎంఐఎం పనిచేస్తుందన్న విమర్శలు కాంగ్రెస్ చేస్తోంది. ఇప్పుడు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో ఎంఐఎం పోటీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందోగాని ఆ స్థానాల్లో కొంత కాంగ్రెస్‌కు ప్రతికూలత ఏర్పడనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.