Site icon vidhaatha

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ఓలా కంపెనీ దీపావళి ఆఫర్స్‌ను చూశారా మరి..!

దేశంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ వాహనాల కంపెనీ ఓలా దీపావళి సందర్భంగా వాహనదారులకు ఆఫర్స్‌ను ప్రకటించింది. బ్యాటరీ వారంటీ, బోనస్‌, వారంటీపై ఆఫర్స్‌ను ఇస్తున్నది. అలాగే ఫైనాన్సింగ్‌ డీల్‌తో పాటు నవంబర్ 10 నుంచి అన్ని స్కూటర్ల పై అదనంగా రూ. 2,000 నుంచి రూ. 26,500 వరకు విలువైన ఆఫర్‌లను వినియోగదారులు పొందే వీలున్నది. కంపెనీకి చెందిన ఎస్‌1 ప్రొ జెన్‌-2 (S1 Pro Gen-2) కొనుగోలుపై వినియోగదారులకు రూ.7వేల విలువైన ఉచిత ఎక్స్‌టెండెడ్‌ బ్యాటరీ వారంటీని పొందేవీలున్నది.


ఎస్‌1 ఎయిర్‌ (S1 Air), ఎన్‌1ఎక్స్‌ప్లస్‌ (S1 X+) కొనుగోలుపై ఎక్స్‌టెండెడ్‌ బ్యాటరీ వారంటీ, కాంప్రెహెన్సివ్‌ ఎక్స్‌టెండెడ్‌ వారంటీలపై 50శాతం వరకు తగ్గిపును ఇస్తున్నది. ఎస్‌1 ప్రో జెన్‌-2 కొనుగులు చేసే వారు ప్రస్తుతం రూ.2వేలు చెల్లించి కాంప్రెహెన్సివ్‌ ఎక్స్‌టెండెడ్‌ వారంటీకి (రూ. 9,000 విలువ) అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నది. అదే సమయంలో వినియోగదారులు పాత ఐసీఈ ద్విచక్ర వాహనాలను మార్చుకొని S1 Pro Gen-2 కొనుగోలు చేస్తే గరిష్ఠంగా రూ.10,000 వరకు ఎక్స్‌ఛేంజ్‌ బెనిఫిట్స్‌ లభించనున్నది. అలాగే ఎస్‌1 ఎయిర్‌, ఎన్‌1ఎక్స్‌ప్లస్‌ మోడల్స్‌ను కొనుగోలు చేసే రూ.5వేల వరకు బోనస్‌ పొందే అవకాశం ఉంది.


ఫైనాన్స్‌పై ఆఫర్స్‌


కొనుగోలుదారులు పలు బ్యాంకు క్రెడిట్‌కార్డులతో ఈఎంఐ మోడ్‌లోనూ ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌లను కొనుగోలు చేసేందుకు వీలున్నది. క్రెడిట్‌కార్డులపై కొనుగోలు చేస్తే రూ.7500 వరకు తగ్గింపు ఆఫర్‌ ఇస్తున్నది. అలాగే జీరో డౌన్‌పేమెంట్‌, నోకాస్ట్‌ ఈఎంఐ, జీరో ప్రాసెసింగ్‌ ఫీజు, 5.99 శాతానికి వడ్డీరేటు తదితర ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు కేవలం దీపావళి వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.


వినియోగదారులు ఏదైనా ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో స్కూటర్‌ని టెస్ట్ రైడ్ చేసే వీలున్నది. లక్కీ కూపన్ ద్వారా ప్రతిరోజూ ఒక వినియోగదారుడు ఎస్‌1ఎక్స్‌ప్లస్‌ స్కూటర్‌ను గెలుచుకునే అవకాశం ఉంది. ఉచిత ఓలా మర్చండైస్, ఓలా కేర్‌ప్లస్‌, డిస్కౌంట్ కూపన్‌లు, S1 ప్రో జెన్ 2 మోడల్‌ కొనుగోలుపై రూ.1000 విలువైన డిస్కౌంట్ కూపన్‌ సైతం వస్తున్నది. మరి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనుగోలు చేయాలని భావిస్తే దగ్గరలో ఉన్న ఓలా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను సంప్రదించండి..!

Exit mobile version