Site icon vidhaatha

Rahul Gandhi | ఇండిగో ఎకానమీ క్లాస్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ!

Rahul Gandhi | లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సాధారణ ప్రయాణికుల మాదిరిగా ఇండిగో విమానంలో సామాన్య ప్రయాణికుల మధ్య ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తూ కనిపించిన దృశ్యం వైరల్ గా మారింది. తాత, తల్లి, తండ్రి ముగ్గురూ దేశానికి ప్రధాన మంత్రులుగా పనిచేశారు. స్వయంగా రాహుల్ కూడా 5సార్లు ఎంపీ.. లోక్ సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయినప్పటికీ విమానంలో సాదాసీదా ప్రయాణం ద్వారా తన సాధారణ మనస్తత్వాన్ని మరోసారి చాటిచెప్పారంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.

తండ్రి రాజీవ్ గాంధీ, నాయనమ్మ ఇందిరా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ నిరాడంబరత, ప్రజలతో మమేకమయ్యే వారసత్వాన్ని రాహుల్ ప్రయాణ ఫోటో గుర్తు చేస్తుందంటున్నారు. దేశానికి మూడు ప్రధానమంత్రులను అందించిన కుటుంబం నుంచి వచ్చినా.. రాహుల్ గాంధీ ప్రజలతో కలిసి, వారి మధ్య ప్రయాణించడం ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. తాత, నానమ్మ, తండ్రిల బాటలో ఇప్పుడీ తరం రాహుల్ గాంధీ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తూ, సామాన్యుల జీవితాన్ని అర్థం చేసుకునే నాయకుడిగా ఎదుగుతున్నాంటున్నారు. పదవి కన్నా ప్రజల మధ్య ఉండే నాయకత్వం గొప్పది” అన్న సత్యాన్ని మరోసారి రుజువు చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు కితాబునిస్తున్నాయి.

Exit mobile version