Site icon vidhaatha

PM Kisan Yojana | రైతన్నలకు గుడ్‌న్యూస్‌..! కిసాన్‌ సమ్మాన్‌ నిధి ఖాతాల్లో ఎప్పుడు జమవుతాయంటే..?

PM Kisan Yojana |

దేశవ్యాప్తంగా రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకంలో భాగంగా ఏటా రైతులకు రూ.6వేల చొప్పున సహాయాన్ని అందిస్తున్నది. ఈ ఆర్థిక సాయాన్ని మూడు విడుతల్లో రూ.2వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే, ఇప్పటి వరకు కేంద్రం 13 వాయిదాల్లో సాయాన్ని రైతుల ఖాతాలకు కేంద్రం బదిలీ చేసింది. ప్రస్తుతం 14వ విడుత కోసం కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఎప్పుడు జమ చేస్తారనే విషయంపై ఇప్పటి వరకు కేంద్రం క్లారిటీ ఇవ్వలేదు.

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను జులై 15లోగా రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో వైపు ఇప్పటి వరకు ఈ-కేవైసీ చేయించుకోని రైతులకు 14వ వాయిదాలో డబ్బులు వచ్చే అవకాశం లేదు. ఆర్థిక సాయం ఖాతాల్లో జమ కావాలంటే తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

అలాగే కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే కిసాన్‌ సమ్మాన్‌ నిధి అందుతుందని, ఒకరి కంటే ఎక్కువ మంది వ్యక్తులు దరఖాస్తు చేసుకుంటే.. తిరస్కరణకు గరవుతుందని అధికారులు పేర్కొన్నారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి కిసాన్‌ సమ్మాన్‌ నిధికి దరఖాస్తు చేసుకున్నా.. ఇద్దరిలో ఒకరికి మాత్రమే ప్రయోజనం అందుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. కేంద్రం చివరిసారిగా ఫిబ్రవరి 27న 13వ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version