రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క కుటుంబం కోసం అధికారులు ఒక పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న బార్మర్ జిల్లా పార్ గ్రామంలో 35 మంది కోసం పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు దాంతో రాజస్థాన్ రాష్ట్రంలోనే ఇది అతి చిన్న పోలింగ్ కేంద్రంగా నిలిచింది. పారు గ్రామంలో మూడు వేర్వేరు ఇళ్లలో నివసించే ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మహిళలు, 18 మంది పురుషుల కోసం దీనిని ఏర్పాటు చేశారు. పాక్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న పారు గ్రామ ప్రజలు గత ఎన్నికల వరకు ఓటేయడానికి ఏకంగా 20 కిలోమీటర్ల దూరం వెళ్లేవారు. రోడ్డు సరిగా లేకపోవడంతో కాలినడకన, ఒంటెలపై పోలింగ్ బూత్ కు చేరుకునేవారు.
పోలింగ్ కేంద్రం 20 కిలోమీటర్ల దూరం ఉండడంతో కొందరు వృద్ధులు, మహిళలు తమ తన ఓటు హక్కును వినియోగించుకునే వారు కాదు. ఈ పరిస్థితి తెలుసుకున్న ఎన్నికల కమిషన్ అధికారులు పారు గ్రామంలో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాంతో ఆ గ్రామ జనాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.