న్యూఢిల్లీ: మహిళలకు లోక్‌సభ, అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ శుక్రవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి గురువారమే బిల్లుకు సమ్మతి తెలిపారని అందులో పేర్కొన్నది.
దీంతో ఇకపై దీనిని రాజ్యాంగ (106వ సవరణ) చట్టంగా పిలుస్తారు. దీని ప్రకారం కేంద్ర పరభుత్వం అధికారికంగా గెజిట్‌లో ప్రకటించిన తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. జనాభా లెక్కల అనంతరం 2026లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా మహిళలు పోటీ చేసే 33 శాతం సీట్లను గుర్తిస్తారు. తదుపరి 2029 ఎన్నికల నుంచి వాటిలో మహిళలే పోటీ చేస్తారు.