Site icon vidhaatha

Lead Poisoning | 20 ఏళ్లుగా ఒకే కుక్క‌ర్‌లో అన్నం వండిన భార్య‌.. లెడ్ పాయిజ‌నింగ్‌తో ఆస్ప‌త్రి పాలైన భ‌ర్త‌

Lead Poisoning | చాలా మంది గృహిణులు క్ష‌ణాల్లో వంట( Cook ) చేసేస్తుంటారు. ఎందుకంటే వంట ప‌ని అయిపోతే రిలాక్స్‌గా ఉండొచ్చ‌ని. ఇక త్వ‌ర‌గా వంట అయ్యేందుకు చాలా మంది మ‌హిళ‌లు ప్రెజ‌ర్ కుక్క‌ర్‌( Pressure Cooker ) ల‌ను వినియోగిస్తుంటారు. అన్నం వండే స‌మ‌యంలో ఒక రెండు విజిల్స్ పెడితే.. ఐదు నిమిషాల్లో అన్నం రెడీ. ఇక కూర‌ల విష‌యంలో ఓ ఐదారు విజిల్స్ పెడితే.. 10 నిమిషాల్లో కూర రెడీ. ఇలా ఓ అర గంట‌లో నాలుగైదు ర‌కాల వంట‌లు త‌యారు చేస్తారు.

కానీ ఈ ప్రెజ‌ర్ కుక్క‌ర్‌లో వంట‌లు చేయ‌డం ఏ మాత్రం మంచిది కాద‌ని డాక్ట‌ర్లు( Doctors ) హెచ్చ‌రిస్తున్నారు. ఒకే ప్రెజ‌ర్ కుక్క‌ర్‌( Pressure Cooker )ను ఏండ్ల త‌ర‌బ‌డి వినియోగించొద్ద‌ని సూచిస్తున్నారు. ఎందుకంటే ఓ మ‌హిళ 20 ఏండ్లుగా ఒకే ప్రెజ‌ర్ కుక్క‌ర్‌లో అన్నం వండుతుంది. ఆమె భ‌ర్త ఆ కుక్క‌ర్‌లో వండిన అన్నం, ఇత‌ర ప‌దార్థాల‌ను తిని లెడ్ పాయిజ‌నింగ్‌( Lead Poisoning )కు గుర‌య్యాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర( Maharashtra ) రాజ‌ధాని ముంబై( Mumbai )లో వెలుగు చూసింది.

ముంబైకి చెందిన ఓ 50 ఏండ్ల వ్య‌క్తి.. ఇటీవ‌ల తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఆస్ప‌త్రిలో చేరాడు. ఇంట‌ర్న‌ల్ మెడిసిన్ స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ విశాల్ గ‌బాలే.. బాధిత వ్య‌క్తిని ప‌రిశీలించి షాక్ అయ్యాడు. అత‌ని శ‌రీర‌మంతా లెడ్ పాయిజనింగ్ అయింద‌ని వైద్య ప‌రీక్ష‌ల్లో తేలింది. అత‌ను మెమోరీ కోల్పోవ‌డం( Memory loss ), కాళ్లల్లో తీవ్రమైన నొప్పి, క‌డుపు నొప్పి రావ‌డం వంటి ల‌క్ష‌ణాలు ఉన్నాయి. ఇదంతా లెడ్ కెమిక‌ల్ టాక్సిసిటీ( Lead Chemical Toxicity ) వ‌ల్ల జ‌రుగుతుంద‌ని డాక్ట‌ర్ తెలిపారు.

బాధిత రోగిని ప‌రిశీలించి, వైద్య ప‌రీక్ష‌లు చేసిన‌ప్పుడు అన్ని రిపోర్ట్స్ సాధారణంగా ఉన్నాయి. కానీ హెవీ మెట‌ల్ స్క్రీనింగ్‌లో అత‌ను లెడ్ పాయిజ‌నింగ్‌కు గురైన‌ట్లు నిర్ధార‌ణ అయింది. లెడ్ స్థాయిలు డెసిలీట‌ర్‌కు 22 మైక్రోగ్రాముల చొప్పున అత‌ని శ‌రీరంలో ఉన్నాయి. ఇది దీర్ఘ‌కాలిక లెడ్ పాయిజ‌నింగ్‌కు దారి తీసింద‌ని డాక్ట‌ర్ గ‌బాలే పేర్కొన్నారు. లెడ్ పాయిజ‌నింగ్ వ‌ల్ల శ‌రీరంలోని అవ‌య‌వాలు దెబ్బ‌తింటాయి. బ్రెయిన్, కిడ్నీలు దెబ్బ‌తిన‌డంతో పాటు ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌న్నారు.

మ‌రి లెడ్ పాయిజనింగ్‌కు ఎలా గుర‌య్యాడంటే..?

రోగితో పాటు అత‌ని భార్య‌ను విచారించిన‌ప్పుడు లెడ్ పాయిజనింగ్‌కు గ‌ల కార‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని డాక్ట‌ర్ తెలిపారు. గ‌త 20 ఏండ్ల నుంచి రోగి భార్య ప్రెజ‌ర్ కుక్క‌ర్‌లోనే వంట చేస్తుంద‌ని తేలింది. పాత‌, పాడైన అల్యూమినియం కుక్క‌ర్‌ల‌లో సీసం( Lead ), అల్యూమినియం( aluminum ) క‌ణాలు ఆహారంలో క‌లిసిపోతాయ‌ని, త‌ద్వారా లెడ్ పాయిజనింగ్‌కు గుర‌వుతార‌ని నిర్ధారించారు. దీంతో నాడీ వ్య‌వ‌స్థ‌పై ప్రభావం చూపి, మెద‌డు ప‌ని నెమ్మ‌దిస్తుంద‌న్నారు. రోగికి కీలేష‌న్ థెర‌పీ నిర్వ‌హించామ‌ని, ప్ర‌స్తుతం కోలుకుంటున్నాయ‌ని డాక్ట‌ర్ గ‌బాలే పేర్కొన్నారు.

లెడ్ పాయిజ‌నింగ్ ల‌క్ష‌ణాలు ఇవే..

క‌డుపు తిమ్మిరిగా ఉండ‌డం
హైప‌ర్ యాక్టివిటీ
త‌ల‌నొప్పి
వాంతులు
వికారంగా ఉండ‌డం
అనిమీయా
కాళ్లు, పాదాల్లో వ‌ణుకు
శృంగార సామ‌ర్థ్యాన్ని కోల్పోవ‌డం
వ్యంధ్య‌త్వ స‌మ‌స్య‌లు
మూత్ర‌పిండాల స‌మ‌స్య‌లు

Exit mobile version