Site icon vidhaatha

Milk: ప్యాకెట్ పాలను మళ్లీ మళ్లీ మరిగిస్తున్నారా.. ఎంత డేంజరో తెలుసా?

 

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సమాజాం మారుతున్న కొద్ది నగరాలు, పట్టణాల్లో ఉంటున్న వారికి ప్యాకెట్ పాలే దిక్కవుతున్నాయి. అయితే, ఈ ప్యాకెట్ పాలను మరిగించకుండా నేరుగా తాగవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. పాల ప్యాకెట్లపై సాధారణంగా ‘పాశ్చరైజ్డ్’, ‘టోన్డ్’, లేదా ‘UHT’ వంటి లేబుల్స్ ఉంటాయి. ముఖ్యంగా పాశ్చరైజ్డ్ పాలను తాగే ముందు మరిగించడం అవసరమా? దీని వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు ఏమిటి? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం.

పాశ్చరైజ్డ్ పాలను మరిగించాలా?

పాశ్చరైజ్డ్ పాలను ఒకసారి మరిగించిన తర్వాత రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేస్తే, మళ్లీ మరిగించాల్సిన అవసరం లేదు. అప్పటికే వేడి చేయడం వల్ల పాశ్చరైజ్డ్ పాలల్లో బ్యాక్టరీయా నశిస్తుంది. అందువల్ల, ప్యాకెట్ సరిగ్గా నిల్వ చేయబడి, కలుషితం కానట్లయితే, ఒకసారి మరిగిస్తే సరిపోతుంది. అయితే, పాలు కలుషితమైనట్లు అనిపిస్తే లేదా సరిగా నిల్వ చేయకపోతే మాత్రమే మళ్లీ మరిగించాలి. రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన పాశ్చరైజ్డ్ పాలను త్వరగా ఉపయోగించడం మంచిది.

మరిగించడం వల్ల నష్టాలు

పాలను మరిగించడం వల్ల కొన్ని పోషకాలు నష్టపోతాయి. ముఖ్యంగా వేడికి సున్నితమైన బి విటమిన్లు (బి1, బి2 లేదా రిబోఫ్లేవిన్, బి3, బి6, ఫోలిక్ యాసిడ్) నశిస్తాయి. సుమారు 36% పోషకాలు కోల్పోయే అవకాశం ఉంది. ఉదాహరణకు, పాలలో సహజంగా లభించే రిబోఫ్లేవిన్ మరిగించడం వల్ల తగ్గుతుంది. అలాగే, మరిగించడం వల్ల పాలలోని కొన్ని ప్రోటీన్లు మార్పుచెంది, కొవ్వు పదార్థాలపై ప్రభావం చూపుతాయి. అయితే, మొత్తం కొవ్వు, కాల్షియం స్థాయిలు గణనీయంగా మారవు.

ఆవు పాల విషయంలో

మీ ఇంట్లో ఆవు ఉంటే, దాని నుంచి సేకరించిన తాజా పాలను ఎక్కువసార్లు మరిగించడం వల్ల పోషక విలువలు కోల్పోయే అవకాశం ఉంది. సరైన పరిశుభ్రత పాటించినట్లయితే, ఈ పాలను ఒకసారి మరిగించి లేదా నేరుగా కూడా తాగవచ్చు.

మరిగించడం వల్ల ప్రయోజనం

పాలను మరిగించడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా నాశనం అవుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. అయితే, పాశ్చరైజ్డ్ పాలు ఇప్పటికే ఈ ప్రక్రియకు గురైనవి కాబట్టి, వీటిని మళ్లీ మళ్లీ మరిగించడం అవసరం లేదు. పాశ్చరైజ్డ్ పాలను తాగే ముందు ఒకసారి మరిగించడం ఉన్నప్పటికీ, సరైన నిల్వ ఉన్న పాలను రిఫ్రిజిరేటర్ నుంచి తీసి నేరుగా ఉపయోగించవచ్చు.

Exit mobile version