Site icon vidhaatha

Viral video: పేలిన అగ్ని పర్వతం..పర్యాటకుల పరుగో పరుగు!

Viral video: ఇటలీలోని సిసిలీ తూర్పు తీరంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఆకస్మాత్తుగా బద్దలైన ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అగ్ని పర్వతం బద్దలైపోయి మంటలు, బూడిద ఎగసిపడటంతో ఊహించని ఘటనతో షాక్ గురైన పర్యాటకులు, ట్రెక్కర్లు(పర్వాతోరోహకులు), స్కీయింగ్ టూరిస్టులు ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీశారు. పర్యాటకులను తరముతున్నట్లుగా వారి వెనుక నుంచి బూడిద, ప్రమాదకర వాయువులు పరుగెడుతున్న పర్యాటకులను వెంటాడుతున్నట్లుగా వెనుక నుంచి వేగంగా సమీపిస్తుండటంతో వాటి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వారు పర్వతా ప్రాంతాల్లో పడుతూ లేస్తూ పరుగు తీశారు. సిసిలీ ద్వీపంలో ఉండే ఈ పర్వతం ఎత్తు 3,300మీటర్లు. మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఆఫ్రికా-యూరేషియా టెక్టానిక్ ప్లేట్లు కలిసే ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ తరచూ అగ్నిపర్వతం బద్దలవుతుంది. గత ఐదేళ్లుగా ప్రకంపనలతో ఉనికి చాటుతున్న మౌంట్ ఎట్నా అగ్ని పర్వతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటని ఇటలీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వోల్కనాలజీ వెల్లడించింది.

కొన్ని గంటలుగా ఈ అగ్నిపర్వతం నుంచి బూడిద ఎగసిపడుతూనే ఉండటంతో మరిన్ని విస్ఫోటనాలు సంభవించే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. సమీప గ్రామాల ప్రజలను, పర్యాటకులను రక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదకరమైన వాయువులు విడుదల అవుతూ నాలుగు కిలోమీటర్ల వరకు వ్యాపించాయి. దీంతో ముందు జాగ్రత్తగా అక్కడి ఎయిర్ పోర్టులను మూసివేసి, విమానాలను దారి మళ్లించారు. ప్రజలంతా మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

 

Exit mobile version