Radhika- Nita Ambani| జూలై 12న అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ చిన్ననాటి స్నేహితురాలైన రాధికా మర్చంట్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుక జరగగా,ఈ వివాహానికి టాలీవుడ్ సెలెబ్రిటీలు కొందరు హాజరయ్యారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రతా షిరోద్కర్, కూతురు సితార తో పాటు రామ్‍చరణ్ తన భార్య ఉపాసన , హీరో విక్టరీ వెంకటేశ్, రానా ఆయన భార్య మిహికా, అఖిల్ ఇలా పలువురు సెలబ్రిటీలు అనంత్ అంబానీ – రాధికా మెర్చంట్ వివాహ వేడుకలో పాల్గొన్నారు. పెళ్లి వేడుకలో అనంత్ అంబానీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన నారింజ రంగు షేర్వానీ ధరించారు.
అనంత్ అంబాని తన నివాసం యాంటిలియా నుంచి సుందరంగా అలంకరించిన ఎరుపు రంగు కారుపై సంగీతం, నృత్యాల మధ్య ఊరేగింపుగా కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు.ఇక గుజరాతీ సాంప్రదాయ రంగులైన తెలుపు, ఎరుపు మేళవింపు బట్టల్లో వధువుగా రాధిక మర్చంట్ మెరిసిపోయింది. ఈ డ్రెస్‌ని అబుజానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేశారు. అప్పగింతల వేడుకకు రాధిక మర్చంట్ వేసుకున్న దుస్తులు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.ఈ దుస్తులు మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. అప్పగింతలకు సంబంధించిన దుస్తులు నిజమైన బంగారంతో డిజైన్ చేయడం విశేషం. బ్రొకేడ్ సిల్క్ లెహెంగాలో బనారసీ బ్రొకేడ్ డిజైనింగ్ కనిపించింది. లెహెంగా, బ్లవుజు లుక్ ను బనారసీ సిల్క్ దుపట్టాతో తయారు చేశారు. అలానే భుజం మీద ధరించిన దుపట్టాకు నిజమైన బంగారం ఎంబ్రాయిడరీ ఉంది. ఇక గుజరాత్ లోని కచ్ ప్రాంతానికి చెందిన అభో అనే సాంప్రదాయ వస్త్రసంపద ఆధారంగా నిజమైన బంగారంతో కర్చోబీ వర్క్ ను జాకెట్ మీద డిజైన్ చేశారు.
ఇక వాటితో పాటు బంగారం, వజ్రాలు, పచ్చలు పొదిగిన చోకర్, హెవీ నెక్‌లేస్, పోల్కీ ఇయర్ రింగ్స్, వంకీ, గాజులు,చేతికి ఉంగరాలు, నుదుటిన పాపిడ బిల్లతో పైనుంచి కింది దాకా వజ్ర వైడూర్యాలున్న నగలు ధరించింది రాధిక.మరోవైపు పెళ్లి వేడుకలో ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ధరించిన చీరపైనే అందరి దృష్టి పడింది.నీతా అంబానీ బనారసీ సిల్క్ ఘాగ్రా ధరించగా దానిని అబు జానీ, సందీప్ ఖోస్లా డిజైన్ చేశారు. చీరపై స్వదేశీ, సంప్రదాయ బనారసీ లెహెరియా దుపట్టా ధరించారు. దీనిని ఆర్టిజన్లు విజయ్ కుమార్, మౌనికా మౌర్య రూపొందించారు. బంగారాన్ని పొదిగిన రూ.కోట్ల విలువైన ఈ చీర అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ డ్రెస్‌లో నీతా అంబానీ చాలా అందంగా కనిపించారు.