రాష్ట్రపతిని కలిసిన .. ప్రధాని మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వినతి

న్డీఏ లోక్‌సభ పక్ష నేతగా ఎన్నికైన ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని మోదీ రాష్ట్రపతిని అభ్యర్థించారు.

  • Publish Date - June 7, 2024 / 06:44 PM IST

నడ్డా నివాసంలో ఎన్డీఏ మిత్ర పక్ష నేతల భేటీ
ఆదివారం ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం

విధాత : ఎన్డీఏ లోక్‌సభ పక్ష నేతగా ఎన్నికైన ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని మోదీ రాష్ట్రపతిని అభ్యర్థించారు. తనను ఎన్డీఏ లోక్‌సభ పక్ష నేతగా ఎన్నుకున్న తీర్మానాన్ని, మద్దతునిస్తున్న ఎన్డీఏ పక్షాల లేఖలను రాష్ట్రపతికి అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ వివరాలను రాష్ట్రపతికి అందచేశారు. మోదీ మెజార్టీపై సంతృప్తి చెందిన రాష్ట్రపతి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మోదీని ఆహ్వానించారు. అందుకు సంబంధించిన లేఖను మోదీకి అందించారు. ఆదివారం ప్రధానిగా మోదీ మూడోసారి తన మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మంత్రివర్గ కూర్పు కసరత్తుకు ఎన్డీఏ భేటీ
రాష్ట్రపతిని కలిసిన అనంతరం ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గం కూర్పుకు సంబంధించి చర్చించేందుకు మోదీ మరోసారి ఎన్డీఏ మిత్రపక్షాలతో భేటీ అయ్యారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో మోదీ ఎన్డీఏ మిత్ర పక్ష నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, చంద్రబాబు, నితీశ్‌కుమార్‌, అజిత్ పవర్ సహా ఎన్డీఏ మిత్రపక్ష నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ కూర్పు, ఇతర అంశాలపై చర్చించారు.

 

 

Latest News