Site icon vidhaatha

HS Panag | మణిపూర్‌లో ఆర్మీని దించాలి.. అప్పుడే అక్కడ శాంతి: పనగ్

HS Panag |

న్యూఢిల్లీ :మణిపూర్‌లో శాంతి స్థాపనకు మిలిటరీని దించడమే మార్గమని సైనిక నిపుణుడు, రిటైర్డ్‌ లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఎస్ పనగ్ అన్నారు. పనగ్ సైన్యంలో 40 సంవత్సరాలు పనిచేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. ‘మణిపూర్‌లో శాంతికి సంబంధించి అన్ని రకాల వినతలూ ముగిశాయి. అక్కడ శాంతి ఎండమావిలా తయారైంది.

ఇప్పుడైనా ఆ సమస్యకు పరిష్కారం వెదకాలి. మణిపూర్‌లో వెంటనే సైన్యాన్ని రంగంలోకి దించి, పరిస్థితులను అదుపులోకి తేవాలి’ అని పేర్కొన్నారు. మణిపూర్‌లో విస్తృతమైన సైనిక, పోలీసు, పారామిలిటరీ బలగాలు ఇప్పటికే వున్నాయని ఆయన గుర్తు చేశారు.

దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే అత్యధిక పోలీసు బలగాలను మోహరించిన రాష్ట్రమని తెలిపారు. ఈ బలగాల మోహరింపుతో పాటు ఇక్కడ అదనంగా ‘సైనిక బలగాల విశేషాధికారాల చట్టాన్ని కూడా అమలు చేయాలని చెప్పారు. సైనిక బలగాలను,ఈ చట్టాలను సమర్థవంతంగా అమలుచేయడానికి యునిఫైడ్ కమాండ్‌ను ఏర్పాటుచేయాలన్నారు.

ఈ కమాండ్ తక్కువ శక్తిని ప్రయోగించి, తక్కువ నష్టాలతో మణిపూర్‌లో శాంతి స్థాపన దిశగా సాగాలని సూచించారు. మణిపూర్‌లో సాయుధ మిలిటెంట్ మూకలను నిరాయుధులను చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.

Exit mobile version