sanjay raut । ఏక్‌నాథ్ షిండే శకం ముగిసిపోయిందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఇక ఆయన మహారాష్ట్రకు ఎన్నటికీ సీఎం కాలేరని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను బీజేపీ ఏకపక్షంగా ఎంపిక చేసిందని ఆరోపించిన సంజయ్ రౌత్.. ఏక్‌నాథ్ షిండేను బీజేపీ వాడుకుని విసిరిపారేసిందని వ్యాఖ్యానించారు. గురువారం ముంబైలో మీడియాతో మాట్లాడిన రౌత్.. షిండే శకం ముగిసిపోయింది. ఆయనను వాడుకోవడం అయిపోయింది. ఇప్పుడు పక్కకు విసిరిపారేశారు. రాష్ట్రానికి షిండే ఇక ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు* అని అన్నారు. తన భాగస్వామ్య పక్షాలను బలహీనపర్చి, వాటిని నాశనం చేసే రాజకీయ వ్యూహాన్ని బీజేపీ అనుసరించిందని సంజయ్ రౌత్ విమర్శించారు. “వాళ్లు షిండే పార్టీని చీల్చగలరు కూడా. రాజకీయాల్లో బీజేపీ ఎప్పుడూ అనుసరించే మార్గమే ఇది. వారితో కలిసి పని చేసిన పార్టీని ముక్కలు చేసి, అంతమొందించగలరు” అని అన్నారు.
మెజార్టీ ఉన్నా కూడా ప్రభుత్వ ఏర్పాటుకు మహాయుతికి 15 రోజులు ఎందుకు పట్టిందని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. అధికార కూటమిలో బలమైన విభేదాలు ఉన్నాయని, రేపటి నుంచి అసలు సంగతులు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. @ఈ రోజు నుంచి దేవేంద్ర ఫడణవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనకు మెజార్టీ ఉన్నది. కానీ.. పదిహేను రోజులుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోయారు. దానర్థం వారి పార్టీలో లేదా మహాయుతిలో ఏదో తేడా ఉన్నదని. రేపటి నుంచి దీని సంకేతాలు కనిపిస్తాయి* అని అన్నారు. @వారు దేశ ప్రయోజనాల కోసమో, మహారాష్ట్ర ప్రయోజనాలకోసమో వారు పని చేయడం లేదు. వారి స్వార్థం కోసంమే ఒక దగ్గరకు చేరారు. కానీ.. ఎన్నికల ఫలితాలను తాము ఆమోదించడం లేదంటూ వాటికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అయినా.. ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి వస్తున్నారు. ఆయనను మేం స్వాగతిస్తాం* అని సంజయ్ రౌత్ చెప్పారు,.
ఇదిలా ఉంటే.. తన రెండున్నరేళ్ల పాలనా కాలంపై ఏక్‌నాథ్ షిండే సంతృప్తిని వ్యక్తం చేశారు. @రెండున్నర సంవత్సరాల పదవీకాలంపై నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా మహాయుతి ప్రభుత్వంతో మేం ముగ్గురం చేసిన పనులు విశేషమైనవి. అవి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి ఉంటాయి* అని అన్నారు.