Indian Railway | రైల్వే ప్రయాణికులకు మోదీ సర్కారు గుడ్‌న్యూస్‌..! త్వరలో మళ్లీ సీనియర్‌ సిటిజన్లకు టికెట్లపై రాయితీ..!

Indian Railway | సీనియర్‌ సిటిజన్లకు నరేంద్ర మోదీ ప్రభుత్వం శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతున్నది. కరోనా మహమ్మారి అనంతరం రైల్వేశాఖ సీనియర్‌ సిటిజన్లకు నిలిపివేసిన రాయితీని పునః ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నది. ఇదే జరిగితే కోట్లాది మంది సీనియర్‌ సిటిజన్లకు భారీగా కలుగనున్నది. సీనియర్‌ సిటిజన్లకు రైలు ఛార్జీలు సబ్సిడీని దాదాపు నాలుగేళ్ల కింద నిలిపివేసిన విషయం తెలిసిందే.

  • Publish Date - June 30, 2024 / 11:30 AM IST

Indian Railway | సీనియర్‌ సిటిజన్లకు నరేంద్ర మోదీ ప్రభుత్వం శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతున్నది. కరోనా మహమ్మారి అనంతరం రైల్వేశాఖ సీనియర్‌ సిటిజన్లకు నిలిపివేసిన రాయితీని పునః ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నది. ఇదే జరిగితే కోట్లాది మంది సీనియర్‌ సిటిజన్లకు భారీగా కలుగనున్నది. సీనియర్‌ సిటిజన్లకు రైలు ఛార్జీలు సబ్సిడీని దాదాపు నాలుగేళ్ల కింద నిలిపివేసిన విషయం తెలిసిందే. ఛార్జీలకు సంబంధించిన ప్రకటన జారీ చేస్తే మోదీ ప్రభుత్వం సీనియర్‌ సిటిజన్స్‌కు ఇదే భారీ కానుక ఇచ్చినట్లు అవనున్నది. మోదీ ప్రభుత్వం నాలుగేళ్ల తర్వాత సీనియర్‌ సిటిజన్లకు రైలు ఛార్జీల్లో రాయితీని పునరుద్ధరించబోతున్నట్లుగా జాతీయ మీడియా పేర్కొంది. అయితే, ఏసీ కోచ్‌లకు బదులుగా కేవలం స్లీపర్‌ క్లాస్‌లో మాత్రమే రాయితీని పునరుద్ధరించనుందని.. ఈ దిశగాఓ చర్చలు జరుగుతున్నాయని జాతీయ మీడియా పేర్కొంది.

రైల్వేలపై కనీస ఆర్థిక భారం మోపినా.. కేవలం స్లీపర్‌ క్లాస్‌లో కూడా ప్రయాణించే ఆర్థిక సామర్థ్యం లేని సీనియర్‌ సిటిజన్లకు మాత్రమే ఛార్జీల్లో రాయితీ ఇవ్వనుందని చెప్పింది. అయితే, రైల్వే ఛార్జీల్లో రాయితీని పొందాలనుకునే సీనియర్‌ సిటిజన్స్‌కు మాత్రమే రాయితీ ఇవ్వనుందని తెలిపింది. గతంలో మాదిరిగా వయసును బట్టి మాత్రం సబ్సిడీ వర్తించదని.. సీనియర్‌ సిటిజన్లు టికెట్‌ బుకింగ్‌ చేసే సమయంలో రిజర్వేషన్‌ పామ్‌లో రాయితీ కాలమ్‌ను పూరించాల్సి రానున్నది. ప్రతి ప్రయాణికుడికి రెండు లేదా మూడుసార్లు మాత్రమే రాయితీ ఇచ్చేలా ప్రతిపాదనలను చేస్తున్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. కోవిడ్‌కు ముందు నిబంధనల ప్రకారం.. సీనియర్ సిటిజన్‌లకు జనరల్, ఏసీ, స్లీపర్ కోచ్‌లలో ప్రయాణం సమయంలో 50శాతం వరకు తగ్గింపు ఇచ్చింది. కరోనా మహమ్మారికి ముందు రైల్వేలు 60 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులకు ప్రాథమిక ఛార్జీలో 40శాతం వరకు డిస్కౌంట్‌ ఇచ్చేది.

58 అంతకంటే ఎక్కువ వయసున్న మహిళలకు 50శాతం వరకు రాయితీ ఇచ్చింది. ఆ సబ్సిడీని మార్చి 2020లో నిలిపివేసింది. రైల్వేశాఖ ఛార్జీల్లో ఇచ్చే రాయితీ విషయం పార్లమెంటులో కూడా చర్చకు వచ్చింది. అయితే, రైల్వేశాఖ ఇప్పటికే ప్రయాణికుల ఛార్జీల్లో రూ.59,837 కోట్ల సబ్సిడీని ఇస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికుడిపై సగటు వ్యయం రూ.110 అవుతుండగా.. కేవలం రూ.45 మాత్రమే ఛార్జి వసూలు చేస్తున్నట్లుగా తెలిపింది. ఇటీవల రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ మాట్లాడుతూ కొవిడ్‌ తర్వాత సీనియర్‌ సిటిజన్ల రైలు ప్రయాణలు పెరిగాయాన్నారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన ఆయన.. 2020 మార్చి 20 నుంచి 2021 మార్చి 31 మధ్య 1.87కోట్ల మంది సీనియర్‌ సిటిజన్లు రైలులో ప్రయాణించారని తెలిపారు. అదే సమయంలో ఒకటి ఏప్రిల్ 2021- ఫిబ్రవరి 2022 మధ్య 4.74 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు రైలులో ప్రయాణించారన్నారు. ఆ సమయంలో రైల్వే మంత్రి సీనియర్‌ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించేందుకు నిరాకరించారు. తాజాగా మళ్లీ పలు మార్పులతో అమలు చేసేందుకు ప్రభుత్వం పురాలోచన చేస్తున్నట్లు సమాచారం.

Latest News