Silver Record Price| వెండి పరుగు..రూ.2లక్షల 9వేలు

అంచనాలకు అనుగుణంగానే వెండి ధరలు పరుగుపెడుతున్నాయి. గురువారం ఒక్క రోజునే కిలో వెండి ధర రూ.2వేలు పెరిగి రూ.2లక్షల 9వేల వద్ధ కొనసాగుతుంది. నిన్న బుధవారం ఏకంగా రూ.8వేలు పెరిగిన వెండి రెండు రోజుల్లోనే వరుసగా రూ.10వేలు పెరిగింది.

విధాత : అంచనాలకు అనుగుణంగానే వెండి ధరలు కొత్త రికార్డులతో (Silver Record Price) పరుగుపెడుతున్నాయి(silver rate jumps). గురువారం ఒక్క రోజునే కిలో వెండి ధర రూ.2వేలు పెరిగి రూ.2లక్షల 9వేల వద్ధ కొనసాగుతుంది. నిన్న బుధవారం ఏకంగా రూ.8వేలు పెరిగిన వెండి రెండు రోజుల్లోనే వరుసగా రూ.10వేలు పెరిగింది. నాలుగు రోజుల్లోనే కిలో వెండిపై రూ.13,100పెరగడం గమనార్హం. డిసెంబర్ 3నుంచి చూస్తే రూ.18,100పెరిగింది. మార్కెట్ నిపుణుల అంచనా కంటే వేగంగా కిలో వెండి ధర రెండు రోజుల్లోనే ఆల్ టైమ్ రికార్డు రూ.2లక్షల మార్కును దాటేసి ముందుకు వెలుతుండటం విశేషం. వెండి ధరలు ఇదే జోరు కొనసాగిస్తే వచ్చే ఏడాదిలో రెట్టింపు ధర నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా వెండికి పెరుగుతున్న డిమాండ్, ఆర్థిక మార్పుల నేపథ్యంలో వెండి ధరలు పైపైకి వెలుతున్నాయి. పెట్టుబడిదారులు వెండి కొనుగోలు కోసం మెుగ్గు చూపుతుండటం..ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీలో వెండి వినియోగంతో పెరిగిన డిమాండ్, ఉత్పత్తిలో తగ్గుదల, డాలర్ బలహీన పడటం వంటి కారణాలతో వెండి ధరలు ఎగబాకుతున్నాయి.

తగ్గిన బంగారం ధరలు

వెండి ధరలు పరుగులు పెడుతున్న క్రమంలో బంగారం ధరలు మాత్రం స్వల్పంగా తగ్గుదల నమోదు చేశాయి.10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.110పెరిగి రూ.1,30,310కి పెరిగింది. 22క్యారెట్ల 10గ్రాముల ధర రూ.100తగ్గి రూ.1,19,450గా కొనసాగుతుంది.

Latest News