Smart Phones | స్మార్ట్ ఫోన్లు డేంజర్ గురూ.. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత గోప్యత

Smart Phones | సంచార్ సాథి యాప్‌ను ప్రతి స్మార్ట్ ఫోన్‌లో ఖచ్చితం చేయాలని ప్రయత్నించి విఫలమైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో నిర్ణయం దిశగా ముందుకు కదులుతున్నది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి లొకేషన్ నిరంతరం ఆన్ లో ఉండే విధంగా చూడాలని టెలికాం కంపెనీలు మొబైల్ తయారీ కంపెనీలను కోరాయి. అయితే ఈ ప్రతిపాదనను యాపిల్, గూగుల్ తో పాటు సామ్ సంగ్ వంటి అంతర్జాతీయ ప్రముఖ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఇక నుంచి నిరంతరం లొకేషన్ ట్రాకింగ్
వ్యతిరేకిస్తున్న యాపిల్, గూగుల్, సామ్ సంగ్

Smart Phones | సంచార్ సాథి యాప్‌ను ప్రతి స్మార్ట్ ఫోన్‌లో ఖచ్చితం చేయాలని ప్రయత్నించి విఫలమైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో నిర్ణయం దిశగా ముందుకు కదులుతున్నది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి లొకేషన్ నిరంతరం ఆన్ లో ఉండే విధంగా చూడాలని టెలికాం కంపెనీలు మొబైల్ తయారీ కంపెనీలను కోరాయి. అయితే ఈ ప్రతిపాదనను యాపిల్, గూగుల్ తో పాటు సామ్ సంగ్ వంటి అంతర్జాతీయ ప్రముఖ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గత వారం సంచార్ సాథి యాప్ ను ఇకనుంచి తయారయ్యే ప్రతి స్మార్ట్ ఫోన్ లో ఫ్రీ లోడ్ చేయాలని తయారీ సంస్థలను కోరిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనపై రాజకీయ పార్టీలు, సంఘ సేవకుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఇష్టం ఉన్న వారు డౌన్ లోడ్ చేసుకోవచ్చని, తప్పనిసరి కాదని కేంద్రం వివరణ ఇవ్వడంతో గొడవ సద్ధుమణిగింది.

కేంద్రంలోని ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలు పలు కేసులలో విచారణ సందర్భంగా మొబైల్ లైవ్ లొకేషన్ ను స్పష్టంగా పొందలేకపోతున్నాయి. టవర్ లొకేషన్ ను మాత్రమే టెలికాం కంపెనీలు అందచేస్తున్నాయి కాని స్పష్టంగా ఎక్కడ ఉన్నది మాత్రం ఇవ్వలేకపోతున్నాయి. అయితే దీనిపై సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెట్టింది. గత జూలై నెలలో కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ సెల్యూలార్ అసోసియేషన్ కు ఒక ఈ మెయిల్ ఫార్వార్డ్ చేసిందంటున్నారు. ఈ అసోసియేషన్ లో రియలన్స్ జియో తో పాటు భారతీ ఏయిర్ టెల్, వోడా ఐడియా వంటి ప్రముఖ కంపెనీలకు ప్రాతినిధ్యం ఉంది. మొబైల్ ఫోన్లలో ఏ-జీపీఎస్ టెక్నాలజీని యాక్టివేట్ చేసేందుకు కంపెనీలకు అనుమతిస్తే లోకేషన్ కచ్చితంగా తెలిసిపొతుందని తెలియచేసింది. ఏ-జీపీఎస్ అంటే భూమి పై ఉన్న రిసీవర్లకు స్థానం, వేగం, సమయ సమాచారాన్ని అందించడానికి ఉపగ్రహ ఆధారిత రేడియో నావిగేషన్ వ్యవస్థ. ఏ-జీపీఎస్ టెక్నాలజీని యాక్టివేట్ అయితే లోకేషన్ ను డిసేబుల్ చేయడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. అయితే ఈ ప్రతిపాదనను యాపిల్, సామ్ సంగ్, గూగుల్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వం పెద్దల వద్ద వ్యతిరేకించాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీల సీఈఓ లతో శుక్రవారం నాడు సమావేశం కావాలని నిర్ణయించింది. అనివార్య కారణాలతో ఈ సమావేశం ఇవాళ వాయిదా పడింది. ఈ సమావేశంలో ఏ-జీపీఎస్ టెక్నాలజీని యాక్టివేట్ పై దిశా నిర్ధేశం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రష్యా దేశం ప్రతి మొబైల్ ఫోన్ లో లైవ్ లొకేషన్ కోసం ప్రత్యేక యాప్ ను తప్పనిసరి చేసి అమలు చేస్తున్నది.

ప్రపంచంలోనే భారతదేశం మొబైల్ వినియోగంలో రెండో స్థానంలో ఉంది. దేశంలో 95 శాతం మందికి పైగా ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతుండగా, 5 శాతం మంది యాపిల్ ఐఓఎస్ ను వినియోగిస్తున్నారు. కేంద్రం ప్రతిపాదనలపై యాపిల్, గూగుల్ కు చెందిన లాబీయింగ్ గ్రూపులు స్పందించాయి. ఏ-జీపీఎస్ టెక్నాలజీని యాక్టివేట్ చేస్తే న్యాయపరంగా, భద్రతాపరంగా అనేక చిక్కులు ఎదురవుతాయని పేర్కొంది. మిలిటరీ, జడ్జీలు, కార్పొరేట్ ఎగ్జిక్యూటీవ్ లు, జర్నలిస్టుల జీవితాలు ప్రమాదంలో పడతాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం వాడుతున్న టెక్నాలజీలో పాప్ అప్ మెస్సేజ్ లు మొబైల్ వినియోగదారుడికి పంపించింది లొకేషన్ తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఈ విధానాన్ని దేశంలోని పోలీసు, నిఘా విభాగం వంటి సంస్థలు విరివిగా వినియోగించుకుంటున్నాయి. పాప్ అప్ ఫీచర్ ను నిషేధించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదని టెలికాం కంపెనీలు చెబుతున్నాయి. వ్యక్తిగత గోప్యత కు ప్రాధాన్యం ఇవ్వాలని, పాప్ అప్ ను డిసెబుల్ చేయాలని కేంద్రం కోరవద్దని జూలై నెలలో కేంద్రానికి రాసిన లేఖలో యాపిల్, గూగుల్ వంటి సంస్థలు వాగ్వాదం చేశాయి. ఇది వారి ప్రాంతం పారదర్శకత, వినియోగదారుడి నియంత్రణనను నిర్థారిస్తుందన్నారు.

Latest News