HPV Vaccination : దేశ వ్యాప్తంగా హెచ్ పీవీ టీకా పంపిణీ ప్రారంభం

దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా పంపిణీ ప్రారంభమైంది. 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా ‘గార్డాసిల్’ ఇవ్వనుండగా, సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఇది కీలకంగా మారనుంది.

HPV Vaccination

విధాత : మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నివారణ సహా ఇతర రకాల క్యాన్సర్ల నివారణ లక్ష్యంగా భారత ప్రభుత్వం చేపట్టిన హెచ్ పీవీ(HPV Vaccination) వ్యాక్సిన్ టీకాల పంపిణీ కార్యక్రమం శనివారం దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్ లోని అజ్మీర్ లో హెచ్ పీవీ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 14 సంవత్సరాల బాలికలకు ‘గార్డాసిల్‌’ అనే టీకాను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్‌ హెచ్‌పీవీ టైప్‌ 16, 18తో పాటు టైప్‌ 6, 11 రకాల నుంచి రక్షణ కల్పించనున్నట్లు కేంద్రం తెలిపింది.

తెలుగు రాష్ట్రాల HPV వ్యాక్సినేషన్ షురు

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన హెచ్ పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో కూడా ప్రారంభమైంది. తెలంగాణలో హైదరాబాద్ కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. 14 ఏళ్ల వయసు ఉన్న బాలికలకు మాత్రమే టీకా పంపిణీ చేయనున్నారు. U-Win పోర్టల్ లో వివరాలను అధికారులు నమోదు చేస్తారు. ఏపీలో సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో హెచ్ పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి :

Virosh | విజ‌య్-ర‌ష్మిక‌ పెళ్లి పోస్ట్ రికార్డు బ్రేక్.. విరాట్ కోహ్లీ ఇన్‌స్టా మార్క్ దాటేసిన క్యూట్ క‌పుల్‌
Mortgage Property | మార్ట్‌గేజ్ ఫ్లాట్‌ల‌ను కొనుగోలు చేస్తున్నారా..? ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి సుమా..!

Latest News