లోక్సభ ఎన్నికల్లో బిజెపి బోణి సూరత్ ఎంపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం

2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ తొలి ఎంపీ స్థానాన్ని గెలుచుకొని బోణి కొట్టింది. సూర‌త్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అభ్య‌ర్థి ముఖేశ్ చంద్రకాంత్ ద‌లాల్ ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ క‌మ్ ఎల‌క్ష‌న్

  • Publish Date - April 22, 2024 / 08:32 PM IST

విధాత : 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ తొలి ఎంపీ స్థానాన్ని గెలుచుకొని బోణి కొట్టింది. సూర‌త్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అభ్య‌ర్థి ముఖేశ్ చంద్రకాంత్ ద‌లాల్ ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ క‌మ్ ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్ సౌర‌భ్ పార్ది తెలిపారు. ద‌లాల్‌కు ఎన్నిక‌ల స‌ర్టిఫికేట్‌ను కూడా అంద‌జేశారు. అంతకుముందు తొలి విడతలో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 అసెంబ్లీ స్థానాలను బిజెపి ఏకగ్రీవంగా గెలుచుకుంది.

వివాదాస్పదమైన ఏకగ్రీవ ఎన్నిక

సూరత్ స్థానం నుంచి నామినేష‌న్ వేసిన అభ్య‌ర్థులు అంద‌రూ పోటీ నుంచి త‌ప్పుకున్నట్లు గుజ‌రాత్ బీజేపీ పార్టీ చీఫ్ సీఆర్ పాటిల్ తెలిపారు. నామినేష‌న్లు విత్‌డ్రా అనంతరం సూర‌త్ నుంచి 8 మంది పోటీలో ఉన్నారు. దాంట్లో ఏడు మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. బీఎస్పీకి చెందిన ప్యారేలాల్ భార‌తి కూడా త‌న పేప‌ర్స్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి నిలేశ్ కుంభాని ప‌త్రాల‌ను జిల్లా రిట‌ర్నింగ్ అధికారి సౌర‌భ్ ప‌ర్గి తోసిపుచ్చారు. సంత‌కాల్లో తేడాలు ఉన్న కార‌ణంగా నిలేశ్ అఫ‌డివిట్‌ను కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ స‌బ్‌స్టిట్యూట్‌గా నామినేష‌న్ వేసిన సురేశ్ ప‌ద‌సాలా ప‌త్రాల‌ను కూడా చెల్ల‌న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఇద్ద‌రు కాంగ్రెస్ అభ్య‌ర్థులు దాఖ‌లు చేసిన నాలుగు నామినేష‌న్ ప‌త్రాలు నిజ‌మైన‌విగా లేన‌ట్లు రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ తెలిపారు. అఫ‌డ‌విట్లు దాఖ‌లు చేసిన అభ్య‌ర్థులు వాటిల్లో స్వ‌యంగా సంత‌కాలు చేయ‌లేద‌న్నారు. ఈ ఘ‌ట‌న‌లో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్లు కాంగ్రెస్ లాయ‌ర్ బాబు మంగూకియా తెలిపారు.

Latest News