Site icon vidhaatha

Swati Maiwal assault case | స్వాతి మాలివాల్‌పై దాడి కేసు.. బిభవ్‌ కుమార్‌కు బెయిల్‌ నిరాకరణ

Swati Maiwal assault case : ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ పీఏ బిభవ్‌కుమార్‌కు తీస్‌ హజారీ కోర్టులో చుక్కెదురైంది. బిభవ్‌కు బెయిల్‌ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం బిభవ్‌ బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

బిభవ్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అతని న్యాయవాది వాదనలు వినిపించారు. బిభవ్‌కుమార్‌పై స్వాతి మాలివాల్‌ చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని ఆయన పేర్కొన్నారు. మాలివాల్‌ కావాలనే సీసీ కెమెరాలు లేనిచోట తనపై దాడి జరిగినట్టుగా కేసు పెట్టారని వాదించారు.

అయితే బిభవ్‌కుమార్‌ దర్యాప్తునకు సహకరించడం లేదని, ఆయనకు బెయిల్‌ ఇవ్వవద్దని ప్రాసిక్యూషన్‌ వాదించింది. వాదనలు విన్న కోర్టు బిభవ్‌కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే తీస్‌ హజారీ కోర్టు తన బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించడంపై బిభవ్‌కుమార్‌ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లనున్నట్లు ఆయన న్యాయవాది ప్రకటించారు.

Exit mobile version