Thai PM Shinawatra | థాయ్ లాండ్ ప్రధాని పదవి నుంచి షినవత్రాను శుక్రవారం రాజ్యాంగ ధర్మాసనం తొలగించింది. ఏడాది పాటు మాత్రమే ఆమె అధికారంలో ఉన్నారు. నైతిక నియమాలను ఉల్లంఘించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఆమె అధికారం చేపట్టిన తర్వాత ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిన్నదనే విమర్శలు వచ్చాయి.
పార్లమెంటు కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునే వరకు, హౌస్ స్పీకర్ నిర్ణయించే తేదీన డిప్యూటీ ప్రీమియర్ ఫుమ్తామ్ వెచాయాచాయ్ ప్రస్తుత మంత్రివర్గం, ప్రభుత్వాన్ని ఆపద్ధర్మ హోదాలో పర్యవేక్షిస్తారు. దిగువ సభ ఎప్పుడు సమావేశమవ్వాలో రాజ్యాంగం నిర్దిష్ట కాలపరిమితిని పేర్కొనలేదు. కంబోడియాతో ఘర్షణ సమయంలో ఆమె వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. కంబోడియా మాజీ ప్రధానితో ఆమె మాట్లాడిన ఫోన్ సంభాషణ లీకైంది. అప్పట్లో ఈ సంభాషణ సంచలనంగా మారింది. దీంతో ఆమె ప్రధాని పదవి నుంచి సస్పెండ్ అయ్యారు.