Site icon vidhaatha

Ministry of Civil Aviation | బీ కేర్‌ఫుల్.. విమానాల్లో ఈ వ‌స్తువుల‌పై నిషేధం..!

Ministry of Civil Aviation | భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ( Ministry of Civil Aviation ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విమానాల్లో తీసుకెళ్లే ల‌గేజీ( Luggage )పై నిఘా పెంచింది. ఎయిర్‌పోర్ట్‌( Airport )లోకి ప్ర‌వేశించే ముందే విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హించాల‌ని సిబ్బందికి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది.

ఆయుధాలు, పేలుడు ప‌దార్థాలు, ప్ర‌మాద‌క‌ర‌మైన వ‌స్తువులు, ప‌రిక‌రాలు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు, స్పోర్ట్స్ ఐటెమ్స్, క‌త్తులు, నైట్ స్టిక్స్, తాళ్లు, సెల్లో, మేజ‌రింగ్ అండ్ మాస్కింగ్ టేప్స్, కొబ్బ‌రి కాయ‌, కొబ్బ‌రి పొడి, బ్లేడ్లు, గొడుగు, మొల‌లు, గాలితో కూడిన ఎయిర్ మ్యాట్ర‌స్, చిల్లి పికెల్, సిగ‌ర్ క‌ట్ట‌ర్స్‌తో పాటు ప‌లు వ‌స్తువుల‌పై నిషేధం విధించారు.

ప్ర‌యాణికులు ప్ర‌తి ఒక్క‌రూ ఈ నిషేధిత వ‌స్తువుల‌ను ఎయిర్‌పోర్టుకు తీసుకురాకూడ‌దు. ఇక త‌మ ల‌గేజీ బ్యాగుల్లో కూడా వాటిని త‌ర‌లించొద్దు. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, ఎయిర్‌పోర్టుల్లోకి వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వ‌మ‌ని పౌర విమానాయాన మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది.

Exit mobile version