Site icon vidhaatha

Budget 2024 | క్యాన్సర్‌ రోగులకు భారీ ఊరట..! మూడురకాల మందులపై కస్టమ్‌ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించిన ఆర్థికమంత్రి

Budget 2024 | ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోదీ 3.0 తొలి బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇందులో చాలా ముఖ్యమైన ఉత్పత్తులపై పన్నులను పెంచుతున్నట్లు, తగ్గిస్తున్నట్లు సీతారామన్ ప్రకటించారు. బడ్జెట్‌లో ఈ ప్రకటనల తర్వాత, ఏ వస్తువులు ఖరీదైనవిగా మారతాయని.. ఏ వస్తువులు చౌకగా మారానున్నయో తెలుసుకుందాం. మూడు రకాల క్యాన్సర్‌ సంబంధిత మందులపై కస్టమ్ డ్యూటీని తొలగించింది. ఎక్స్-రే ట్యూబ్‌, ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్‌లపై కూడా సైతం డ్యూటీని తొలగించింది.

మొబైల్ ఫోన్‌లు, విడిభాగాలపై కస్టమ్ డ్యూటీ, పీసీబీ, మొబైల్ ఫోన్ ఛార్జర్‌లపై 15 శాతం డ్యూటీని తగ్గించింది. 25 ముఖ్యమైన ఖనిజాలపై కస్టమ్స్ సుంకం లేదని తెలిపారు. సోలార్ సెల్స్, ప్యానెళ్ల తయారీ వస్తువులపై పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించింది. బడ్జెట్ సందర్భంగా, ఆర్థిక మంత్రి మరో మూడు క్యాన్సర్ మందులపై కస్టమ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇది క్యాన్సర్ రోగులకు గొప్ప ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని క్యాన్సర్ మందులు, క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే పరికరాలు ధరలు దిగిరానున్నాయి. ఇక పీవీసీ ఫ్లెక్స్‌ బ్యానర్ల దిగుమతి, కొన్ని టెలికాం పరికరాల దిగుమతి అయ్యే వస్తువల ధరలు పెరుగనున్నాయి. మేకిన్‌ ఇండియా కింద దేశంలో తయారయ్య ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఆయా వస్తువుల ధరలకు సంబంధించిన ట్యాక్స్‌లను పెంచుతున్నట్లు వెల్లడించారు.

Exit mobile version