Site icon vidhaatha

Donald Trump | భారత్‌, రష్యాలను చైనాకు కోల్పోయాం : ట్రంప్‌

Donald trump-Modi-Vladimir-Putin-Xi-Jinping

Donald Trump | చైనా కారణంగా భారత్ కు దూరమయ్యామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్(Donald Trump) అన్నారు. శుక్రవారం నాడు సోషల్ మీడియాలో ఆయన ఈ మేరకు పోస్టు పెట్టారు. భారత్ తో పాటు రష్యా కూడా అమెరికాకు దూరమైందని ఆయన ఆ పోస్టులో తెలిపారు. భారత్(Bharat), రష్యా(Russia), చైనా(China) బంధం దీర్ఘకాలం భాగ్యవంతంగా కొనసాగాలంటూ వ్యంగ్యంగా క్యాప్షన్‌ పెట్టారు. కుట్ర బుద్ది ఉన్న చైనాకు ఈ రెండు దేశాలు దగ్గరయ్యాయని ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు. చైనా చీకటి వలయంలో ఈ రెండు దేశాలు చిక్కుకున్నాయని ఆయన అన్నారు. మోడీ, పుతిన్, జిన్ పింగ్ ఇటీవల కలుసుకున్న ఫోటోను షేర్ చేసి ఆయన ఈ వ్యాఖ్యలను తన ట్రూత్ పోస్టులో పోస్టు చేశారు. ఈ ముగ్గురు నేతలకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఎస్‌సీఓ సమ్మిట్ లో(SCO Summit) ఈ ముగ్గురు దేశాల అధినేతలు పాల్గొన్నారు. చైనాలో జరిగిన ఈ సమ్మిట్ కీలకంగా మారింది. గల్వాన్ లో చైనాతో ఘర్షణ తర్వాత ఆ దేశంలో భారత ప్రధాని మోడీ పర్యటించడం ఇదే తొలిసారి. రెండో ప్రపంచ యుద్దంలో జపాన్ గెలిచిన 80వ వార్షికోత్సవాన్ని ఈ నెల 3న చైనా నిర్వహించింది. ఇందులో రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin), ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్ జంగ్(Kim Jong-un) పాల్గొన్నారు. తమ ఆయుధ సంపత్తిని చైనా ఈ సందర్భంగా ప్రదర్శించింది.

దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ స్పందిస్తూ.. ‘ఇప్పటికిప్పుడు దీనిపై మేమేమీ వ్యాఖ్యానించేది లేదు’ అని అన్నారు.

రష్యా(Russia) నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పై 50 శాతం ట్యాక్స్ విధించింది అమెరికా. ఈ ట్యాక్స్ పై భారత్ తన నిరసనను తెలిపింది. అధిక ట్యాక్స్ లు ఉన్నాయనే కారణంగా 25 శాతం ట్యాక్స్ విధించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే పేరుతో మరో 25 శాతం ట్యాక్స్ విధించారు. ఈ 50 శాతం ట్యాక్స్ అమల్లోకి వచ్చింది. అమెరికా ట్యాక్స్ పెంచడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ఇండియా(India) ఫోకస్ పెట్టింది. ఇదే సమయంలో చైనా నుంచి భారత్ కు ఆహ్వానం అందింది. ఎస్‌సీఓ సమావేశంలో పాల్గొనేందుకు మోడీ చైనా వెళ్లారు. అక్కడే రష్యా, చైనా దేశాల అధినేతలతో మోడీ(Modi) భేటీ అయ్యారు. ఈ మూడు దేశాల అధినేతలు చైనాలో భేటీ కావడంపై ప్రపంచ దేశాలు అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నాయి.

Exit mobile version