Vande Bharat | త్వరలో మరో మార్గంలో వందే భారత్‌.. పట్టాలెక్కేది ఎప్పుడంటే..?

Vande Bharat | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్‌ రైలును తీసుకువచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల మధ్య వందే భారత్‌ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. తాజాగా మరికొన్ని మార్గాల్లో వందే భారత్‌ రైళ్లు నడిపేందుకు ప్రతిష్టాత్మకంగా నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.

  • Publish Date - June 29, 2024 / 01:00 PM IST

Vande Bharat | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్‌ రైలును తీసుకువచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల మధ్య వందే భారత్‌ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. తాజాగా మరికొన్ని మార్గాల్లో వందే భారత్‌ రైళ్లు నడిపేందుకు ప్రతిష్టాత్మకంగా నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. త్వరలో బెంగళూరు-మధురై మధ్య త్వరలో కొత్తగా వందే భారత్‌ రైలును నడుపనున్నది. సౌత్‌ రైల్వే ఇప్పటికే ఈ మార్గంలో వందే భారత్‌ ట్రయల్‌ను విజయవంతంగా నిర్వహించింది. అయితే, ఇప్పటికే వందే భారత్‌ రైలు ప్రారంభించాల్సి ఉండగా.. ఈ నెల 17న పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదం నేపథ్యంలో వాయిదాపడింది. వాయిదాపడ్డ వందే భారత్‌ రైలును జూలైలో బెంగళూరు-మధురై మధ్య వందే భారత్‌ రైలును ప్రారంభించింది. ఇప్పటికే రైలు టైమ్‌టేబుల్‌ను సైతం రైల్వేశాఖ సిద్ధం చేసింది.

సమాచారం మేరకు.. వందే భారత్‌ రైలు మధురై రైల్వేస్టేన్‌ నుంచి ఉదయం 5.15 గంటలకు బయలుదేరి.. మధ్యాహ్నం 1.15 గంటలకు బెంగళూరు చేరుతుంది. తిరిగి బెంగళూరు నుంచి 1.45 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు సేలం స్టేషన్‌కు చేరుతుంది. రాత్రి 8.20 గంటలకు తిరుచ్చి నుంచి మధురై స్టేషన్‌కు 10.25 గంటలకు చేరుతుంది. బెంగళూరు-మధురై వందే భారత్ రైలులో ఎనిమిది కోచ్‌లు ఉంటాయి. ఇందులో చైర్‌కార్‌, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ అందుబాటులో ఉంటాయి. డిమాండ్‌ మేరకు భవిష్యత్‌లో అదనంగా కోచ్‌లను పెంచే అవకాశం ఉంది. ఛార్జీల విషయానికి వస్తే.. ఏసీ చైర్‌కార్‌ ధర సుమారు రూ.1300, ఎగ్జిక్యూటివ్‌ కోచ్‌ ధర సుమారు రూ.2300 వరకు ఉండే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మరికొన్ని మార్గాల్లోనూ వందే భారత్‌ను నడిపేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో చెన్నై ఎగ్మోర్‌ నుంచి నాగర్‌కోయిల్‌ మార్గంలోనూ సెమీహైస్పీడ్‌ రైలు నడిపేందుకు ప్రయత్నిస్తున్నది. త్వరలోనే ఈ మార్గంలోనూ పట్టాలెక్కించేందుకు దక్షిణ రైల్వే ఏర్పాట్లు చేస్తున్నది.

Latest News