Naveen Patnaik | ఒడిశాలో 24 ఏండ్ల న‌వీన్ ప‌ట్నాయ‌క్ పాల‌న‌కు బ్రేక్..!

Naveen Patnaik  | ఒడిశాలో మ‌రోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అధికార బీజూ జ‌న‌తా ద‌ళ్ పార్టీ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసింది. బీజూ జ‌న‌తాద‌ళ్ ఆరోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌నుకున్న‌ది. సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ కూడా ఆ ధీమా వ్య‌క్తం చేశారు. కానీ ఈసారి ఒడిశాపై క‌న్నేసిన బీజేపీ.. న‌వీన్ దూకుడుకు బ్రేక్ వేసింది.

  • Publish Date - June 4, 2024 / 12:52 PM IST

Naveen Patnaik  | భువ‌నేశ్వ‌ర్ : ఒడిశాలో మ‌రోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అధికార బీజూ జ‌న‌తా ద‌ళ్ పార్టీ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసింది. బీజూ జ‌న‌తాద‌ళ్ ఆరోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌నుకున్న‌ది. సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ కూడా ఆ ధీమా వ్య‌క్తం చేశారు. కానీ ఈసారి ఒడిశాపై క‌న్నేసిన బీజేపీ.. న‌వీన్ దూకుడుకు బ్రేక్ వేసింది. ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వ ఆధిప‌త్యాన్ని దెబ్బ‌తీయాల‌న్న ఉద్దేశంతోనే బీజేపీ ప‌ని చేసింది. దీంతో 24 ఏండ్ల న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప‌రిపాల‌న‌కు బ్రేక్ ప‌డిన‌ట్టు అయింది.

ఎందుకంటే 147 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఒడిశాలో 73 స్థానాల్లో బీజేపీ లీడింగ్‌లో ఉంది. బీజేడీ 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 13, సీపీఐ(ఎం) ఒక స్థానంలో లీడ్‌లో ఉంది. ఒడిశాలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగ‌ర్ 74. అంటే బీజేపీ మేజిక్ ఫిగ‌ర్‌ను మించి స్థానాల‌ను గెల‌చుకునే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే 73 స్థానాల్లో ఆ పార్టీ లీడింగ్‌లో ఉంది.

ఒడిశా సీఎంగా న‌వీన్ ప‌ట్నాయ‌క్ 24 ఏండ్ల పాటు కొన‌సాగారు. 2000 సంవ‌త్స‌రంలో తొలిసారిగా ఆయ‌న ఒడిశా ముఖ్య‌మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టారు. ఈ ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న గెలిస్తే ఆరోసారి సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన తొలి వ్య‌క్తిగా రికార్డు సృష్టించ‌నున్నారు. కానీ అది సాధ్య‌మ‌య్యేలా లేదు. 1997 నుంచి బీజూ జ‌న‌తా ద‌ళ్ ప్రెసిడెంట్‌గా కొన‌సాగుతున్నారు న‌వీన్ ప‌ట్నాయ‌క్.

2019 ఒడిశా అసెంబ్లీలో ఎన్నిక‌ల్లో బీజేడీ 112 స్థానాల్లో గెలిచి ఎవ‌రి మ‌ద్ద‌తు లేకుండా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు బీజేపీ 23 స్థానాల్లో మాత్ర‌మే గెలుపొందింది.

Latest News