UPI | నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకున్నది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) ద్వారా రూ.2వేలకుపైబడి లావాదేవీలపై ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPI) చార్జీలను విధించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సర్క్యులర్‌ను జారీ చేసింది. అన్ని వ్యాపార లావాదేవీలపై ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 1.1శాతం చార్జ్ చేయనున్నట్లు వెల్లడించింది.
యూపీఐ ద్వారా నెలకు 13 లక్షల కోట్లకు పైగా లావాదేవీలు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత కరెన్సీ చలామణి తగ్గి.. యూపీఐ లావాదేవీలు భారీగా పెరిగాయి. గూగుల్ పే, ఫోన్, పేటీఎం తదితర యూపీఐ నుంచి పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఎన్‌పీసీఐ నిర్ణయంతో వినియోగదారులపై రూ.14,300 కోట్ల భారం పడనుంది. అయితే, బ్యాంక్ ఖాతా, పీపీఐ వాలెట్ మధ్య P2P, P2PM లావాదేవీలపరంగా ఎలాంటి ఛార్జీలు ఉండవని పేర్కొంది. యూపీఐ యాప్స్ ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రూమెంట్ (PPIs) చేసే లాదేవీలు రూ.2వేలకు మించినట్లయితే 1.1 శాతం మేర ఇంటర్‌ఛేంజ్ చార్జీలను కంపెనీలు వసూలు చేయనున్నాయి.
NPCI Press Release: UPI is free, fast, secure and seamless
Every month, over 8 billion transactions are processed free for customers and merchants using bank-accounts@EconomicTimes @FinancialXpress @businessline @bsindia @livemint @moneycontrolcom @timesofindia @dilipasbe pic.twitter.com/VpsdUt5u7U— NPCI (@NPCI_NPCI) March 29, 2023
వాలెట్ లోడింగ్ సర్వీస్ ఛార్జీలను రెమిటర్ బ్యాంకులకు పీపీఐ జారీ చేసే వారు 15 బేసిస్ పాయింట్ల మేర చెల్లిస్తారు. అయితే, వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P), వ్యక్తి నుంచి మర్చంట్‌కి (P2PM) ట్రాన్సాక్షన్లు బ్యాంకు నుంచి పీపీఐ వాలెట్ మధ్య జరిగినట్లయితే ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు మాత్రం వర్తించవు.
పీపీఐ పేమెంట్స్ చేసే లావాదేవీలపై 0.5 శాతం నుంచి 1.1 శాతం వరకు ఇంటర్‌ఛేంజ్ చార్జీలు వసూలు చేయనుండగా.. ఇందులో పెట్రోల్, డీజిల్ కోసం చెల్లింపులపై 0.5 శాతం వసూలు చేస్తారు. టెలికాం, యుటిలిటీస్ పోస్ట్ ఆఫీస్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ పర్పస్‌కి 0.7 శాతం, సూపర్ మార్కెట్లో 0.9 శాతం, మ్యూచువల్ ఫండ్స్, గవర్నమెంట్, ఇన్సూరెన్స్, రైల్వేస్‌లో ఒక శాతం మేర చార్జీలు వర్తించనున్నాయి.
ఇంటర్‌ఛేంజ్ ఫీ అనేది కార్డ్ పేమెంట్స్‌తో అనుసంధానించబడి ఉంటుండగా.. అప్రూవల్, ప్రాసెసింగ్, అథరైజ్డ్ లావాదేవీలపై ఈ చార్జీలు వసూలు చేయనున్నాయి. చార్జీలు ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రానుండగా.. మళ్లీ సెప్టెంబర్ 30లోపు ధరలపై సమీక్షిస్తుంది.
మళ్లీ ఆ సమయంలో సవరించే అవకాశాలున్నాయి. అయితే, పీపీఐ చార్జీల పెంపుతో వినియోగదారుడిపై ఎలాంటి ప్రభావం ఉండదని ఎన్‌పీసీఐ పేర్కొంది. ఇదే విషయాన్ని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సైతం తెలిపింది.