Woman Murder | వారు అత్తమామలు( In Laws ) కాదు మానవ మృగాలు. కన్నబిడ్డ మాదిరి చూసుకోవాల్సిన కోడలి( Daughter in Law ) పట్ల క్రూర మృగాల్లా ప్రవర్తించారు. కోడలికి పిల్లలు( Childrens ) పుట్టడం లేదని చెప్పి.. ఆమె గొంతు కోసి చంపారు అత్తమామలు. ఆ తర్వాత ఆత్మహత్య( Suicide )గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ దారుణ ఘటన కర్ణాటక( Karnataka )లోని బెళగావి( Belagavi ) జిల్లాలో శనివారం సాయంత్రం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బెళగావి( Belagavi ) జిల్లాకు చెందిన రేణుక( Renuka )కు ఐదేండ్ల క్రితం సంతోష్( Santosh ) అనే వ్యక్తితో వివాహమైంది. అయితే ఆమెకు ఇప్పటి వరకు సంతానం కలగలేదు. దీంతో రేణుకను భర్త సంతోష్, అత్తమామలు కామన్న, జయశ్రీ నిత్యం వేధింపులకు గురి చేసేవారు. కోడలి పట్ల క్రూర మృగాల్లా ప్రవర్తించేవారు. ఇక తమ కుమారుడికి వారసుడు కావాలని చెప్పి.. అతడికి ఇటీవలే రెండో వివాహం చేశారు. రెండో భార్య ప్రస్తుతం గర్భిణి. ఈ క్రమంలో రేణుకను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని హింసించారు.
కానీ రేణుక ఇంట్లో నుంచి వెళ్లిపోలేదు. దీంతో బలవంతంగా ఆమెను కామన్న, జయశ్రీ కలిసి రేణుకను తమ బైక్‌పై ఎక్కించుకున్నారు. గ్రామ శివార్లలో ఆమెను బైక్‌పై నుంచి కిందకు తోసేశారు. కానీ ఆమె చనిపోలేదు. దీంతో రేణుక గొంతు నులిమి చంపారు. అనంతరం ఆమె చీరను గొంతుకు, బైక్‌కు కట్టి సుమారు 120 మీటర్ల దూరం వరకు లాక్కెళ్లారు. రేణుక ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేణుకది ఆత్మహత్య కాదు హత్యే అని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో కామన్నను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. కామన్న, జయశ్రీ, సంతోష్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.