Site icon vidhaatha

Aadhaar Update| ఐదేళ్లు దాటాక పిల్లల ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి

విధాత : 7 సంవత్సారల వయసు దాటినా పిల్లల ఆధార్ అప్ డేట్ చేయకపోతే డీయాక్టివేట్‌ అవుతుందని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) స్పష్టం చేసింది. పిల్లల తల్లిదండ్రులు ఆధార్‌ను అప్‌డేట్‌ చేయాలని ఎలక్ట్రానిక్స్ అండ్‌ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో సూచించింది. ఐదేళ్ల లోపు పిల్లలకు బయోమెట్రిక్‌, ఐరిస్‌ అవసరం లేకుండా కేవలం ఫొటో, పేరు, పుట్టిన తేదీ, జెండర్‌, చిరునామా వంటి వివరాలను మాత్రమే ఆధార్‌లో నమోదు చేస్తారని యూఐడీఏఐ పేర్కొంది. ఐదేళ్లు దాటిన పిల్లల వేలిముద్రలు, ఐరిస్‌తో పాటు ఫొటోను సైతం ఆధార్‌లో అప్‌డేట్‌ చేయించాలని తెలిపింది. తల్లిదండ్రులు, సంరక్షకులు ఎవరైనా ఆధార్ కేంద్రానికి వెళ్లి పిల్లల ఆదధార్ వివరాలను ఆప్ డేట్ చేయించవచ్చని తెలిపింది.

ఐదు నుంచి ఏడేళ్ల లోపు పిల్లలు ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకుంటే ఉచితమని.. ఏడేళ్లు దాటిన పిల్లలకు రూ.100 చెల్లించాలని ప్రకటనలో వెల్లడించింది. తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్ వివరాలను క్రమం తప్పకుండా ఆప్ డేట్ చేస్తుండాలని సూచించింది. పాఠశాల అడ్మిషన్‌, పరీక్షల రిజిస్ట్రేషన్‌, స్కాలర్‌షిప్‌, ప్రభుత్వ ప్రత్యక్ష నగదు బదిలీ తదితర పథకాలకు ఆధార్‌ అవసరమవుతుందని పేర్కొంది.

Exit mobile version