Aadhaar Update | నేటి నుండి ఆధార్​ అప్​డేట్​లో సంచలన మార్పులు : మీకు తెలుసా?

UIDAI నవంబర్‌ 1, 2025 నుంచి ఆధార్‌ అప్‌డేట్‌ నిబంధనలు మార్చింది. పేరు, చిరునామా, మొబైల్‌ మార్పు ఆన్‌లైన్‌లో సులభతరం. కొత్త ఫీజులు అమల్లోకి. ఆధార్‌–పాన్‌ లింకింగ్‌ తప్పనిసరి.

New Aadhaar update rules from November 1 — online updates, revised fees, and mandatory PAN linking

Aadhaar Update From November 1: Name Change, New Fees, PAN Linking — 3 Major Rules You Must Know

హైదరాబాద్, నవంబర్‌ 1 (విధాత న్యూస్‌):

ఇకపై ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ చేయాలంటే సేవా కేంద్రం మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు! యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (UIDAI) నేటి నుంచి (నవంబర్‌ 1, 2025) భారీ మార్పులు అమలులోకి తెచ్చింది. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్‌ నంబరు… ఏదైనా మార్చుకోవాలంటే ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో సులభంగా మార్చుకోవచ్చు!

వీటిలో ప్రధానంగా మూడు మార్పులు జరిగాయి.

రూల్‌ 1: ఆధార్‌ వివరాలు ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్‌

నవంబర్‌ 1, 2025 నుంచి ఆధార్‌ కార్డు హోల్డర్లు తమ పేరు, చిరునామా, పుట్టినతేది, మొబైల్‌ నంబర్‌ వంటి వివరాలను ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్‌ చేసుకోవచ్చు.
ఇందుకోసం myAadhaar పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. UIDAI ఆధార్‌ అప్‌డేట్‌ ప్రక్రియను పాన్‌, పాస్‌పోర్ట్‌ వంటి ప్రభుత్వ డేటాబేస్‌లతో అనుసంధానం చేస్తూ సులభతరం చేసింది. ఇది ఆధార్‌ సేవా కేంద్రాల భారం తగ్గిస్తూ పౌరులకు సౌలభ్యాన్ని అందించే పెద్ద మార్పుగా పరిగణించబడుతోంది.

ఇంటి నుంచే అప్డేట్‌ – ఇలా చేయండి

  1. myaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవండి.
  2. 12 అంకెల ఆధార్‌ నంబర్‌ + రిజిస్టర్డ్‌ మొబైల్‌కు వచ్చే OTP ఎంటర్‌ చేయండి.
  3. “Update Your Aadhaar” ఆప్షన్‌ క్లిక్‌ చేసి, మార్చాల్సిన వివరం ఎంచుకోండి.
  4. పాస్‌పోర్టు, రేషన్‌ కార్డు, యూటిలిటీ బిల్లు స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయండి.
  5. OTPతో వెరిఫై చేస్తే… 7–30 రోజుల్లో కొత్త ఆధార్‌ మీ మెయిల్‌కు వస్తుంది!

అయితే వేలిముద్రలు, ఐరిస్​ కంటి స్కాన్‌, ఫోటో వంటి బయోమెట్రిక్‌ మార్పులు మాత్రం ఇంకా ఆధార్‌ సేవా కేంద్రంలోనే మార్చుకోవాలి.

రూల్‌ 2: ఉచిత సేవలకు సెలవు – మార్పులకు రుసుము

UIDAI ఆధార్‌ అప్‌డేట్‌లకు కొత్త ఫీజులను నిర్ణయించింది.

జూన్‌ 14, 2026 వరకు ఆన్‌లైన్‌ డాక్యుమెంట్‌ అప్‌డేట్‌లు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత ఫీజు వర్తించే అవకాశం ఉంది. 5 నుండి 17 ఏళ్ల పిల్లలకు బయోమెట్రిక్‌ అప్‌డేట్‌లు ఉచితం. స్కూళ్లు కూడా విద్యార్థుల ఆధార్‌ యాక్టివ్‌గా ఉండేలా చూడాలని UIDAI ఆదేశించింది.

రూల్‌ 3: ఆధార్‌పాన్‌ లింకింగ్‌ తప్పనిసరి

UIDAI ఆధార్‌–పాన్‌ లింకింగ్‌ను తప్పనిసరిగా ప్రకటించింది.

లింక్‌ చేయడానికి: incometax.gov.in → Quick Links → Link Aadhaar → OTPతో పూర్తి చేయండి.

UIDAI ఈ నిర్ణయంతో పన్ను మోసాలను నివారించడం, వ్యక్తిగత గుర్తింపు వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని వివరాలకు: uidai.gov.in లేదా టోల్‌ఫ్రీ 1947కు కాల్‌ చేయండి.

📜 Aadhaar Rule Changes Effective November 1, 2025

Summary: From November 1, 2025, UIDAI enables online Aadhaar updates for name, address, DOB, and mobile, revises update fees, and mandates Aadhaar–PAN linking by December 31, 2025 to avoid PAN deactivation from January 1, 2026.

  • 🟢 Rule 1: Update demographic details fully online via myAadhaar portal; biometric changes still at enrolment centres.
  • 🟡 Rule 2: New fees — ₹75 (demographic), ₹125 (biometric). Free online updates till June 14, 2026; kids (5–17 yrs) free biometric updates.
  • 🔴 Rule 3: Aadhaar–PAN linking is compulsory. Link by Dec 31, 2025 to avoid PAN deactivation from Jan 1, 2026.

Meta: UIDAI’s new rules simplify Aadhaar updates, revise fees, and enforce PAN linkage for all cardholders.