Site icon vidhaatha

Aadhar Update | సమయం లేదు మిత్రమా..! ఆధార్‌ అప్‌డేట్‌కు వారమే గడువు..! తర్వాత ఛార్జీలు

Aadhar Update | ప్రస్తుత కాలంలో ఆధార్‌ కీలకంగా మారింది. దీని అవసరమెంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ చిన్న పనికైనా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది బ్యాంకు అకౌంట్‌ నుంచి లావాదేవీలు, సిమ్‌కార్డుల కొనుగోలు, ప్రభుత్వ పథకాలకు సైతం ఆధార్‌ కావాల్సిందే.

ఆధార్‌ అనుసంధానంతోనే సంక్షేమ పథకాలు అందుతాయి. అయితే, ఆధార్‌లో ఏవైనా తప్పులుంటే చాలా సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆధార్‌లో తప్పులు సరి చేసుకోవాల్సి ఉంటుంది. మరో వైపు ఆధార్‌ కార్డు తీసుకొని పదేళ్లయిన వారు తప్పనిసరిగా ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని యూఐడీఏఐ సూచిస్తున్నది.

అలాంటి వారికి ఇటీవల ఆఫర్‌ను ప్రకటించింది. ఉచితంగా ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ నెల 14 వరకు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. గడువు ముగిసిన తర్వాత ఛార్జీలు చెల్లించాల్సి రానున్నది.

జూన్‌ 14 తర్వాత ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకునేందుకు కనీసం రూ.50 చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి మే చివరి నాటికి గడువు ముగియగా.. అందరూ ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని యూఐడీఏఐ పొడిగించింది. ఇప్పటి వరకు ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోని వారు వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది.

Exit mobile version