Youth Kisses King Cobra | ఓ గుట్టపై ఓ యువకుడికి నాగుపాము( King Cobra ) కనిపించింది. భారీ పొడవుగా ఉన్న ఆ నల్ల నాగుపాము బుసలు కొడుతూ.. పడగ విప్పి నాట్యమాడుతుంది. ఇక దాన్ని చూసిన ఆ యువకుడికి ముద్దు( Kiss ) అనిపించింది. అక్కడ్నుంచి ఏ మాత్రం పారిపోలేదు. ఆ నాగుపాముతో ఆటలాడేందుకు సిద్ధమయ్యాడు.
ఆటలో భాగంగా.. మొదట నాగుపాము పడగకు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. కానీ పాము బుసలు కొడుతూ కాటేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పడగ విప్పి బుసలు కొడుతున్న పామును మచ్చిక చేసుకునేందుకు ఆ యువకుడు యత్నించాడు. దీంతో పామును ప్రేమగా లాలించాడు. పాము కాస్త నెమ్మదించడంతో.. ఆ అబ్బాయి అంతే నెమ్మదిగా పడగ( Snake Head )పై తన పెదాలను వాల్చాడు.
ఇక పాముకు భయం పుట్టించే విధంగా కాకుండా.. పడగపై మూడు నుంచి నాలుగు సెకన్ల పాటు పెదాలతో ముద్దాడాడు. పాము కూడా ఆ యువకుడికి సరెండర్ అయిపోయింది. అది కూడా కాటేసేందుకు ఏ మాత్రం ప్రయత్నించలేదు. నాగుపాము, యువకుడి లవ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
అయితే ఈ వీడియోను చూస్తున్నంత సేపు.. ఏ క్షణాన ఏం జరుగుతదో అన్న భయం మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. ఈ వీడియోను పూర్తిగా చూసే వరకు ఊపిరి పోయినంత పని కావడం మాత్రం ఖాయమని చెప్పొచ్చు. మీకు గుండె ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి.. బీపీ పెషేంట్లు కాస్త ఆలోచించి చూస్తే బెటర్.