Punjab | క‌ర్రీలో ఎలుక.. రెస్టారెంట్‌పై క‌స్ట‌మ‌ర్లు గ‌రం గ‌రం

విధాత‌: ఆర్డ‌ర్ చేసిన క‌ర్రీలో ఎల‌క క‌ళేబ‌రం రావ‌డంతో ఒక వ్య‌క్తికి తిన్నదంతా లోప‌లి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. పంజాబ్ (Punjab) లూథియానాలోని ఒక రెస్టారెంట్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ వీడియోను స‌ద‌రు వ్య‌క్తి ట్వీట్ చేయ‌డంతో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. ఎన్‌సీ అనే అకౌంట్‌తో ఉన్న పోస్ట్ అయిన వీడియోలో ఓ వ్య‌క్తి త‌ను ఆర్డ‌ర్ చేసిన డిష్‌ల‌ను చూస్తున్నాడు. అంత‌లోనే ఒక నాన్ వెజ్ గ్రేవీ క‌ర్రీపై కెమేరాను ఫోక‌స్ చేయ‌గా […]

  • Publish Date - July 5, 2023 / 02:03 AM IST

విధాత‌: ఆర్డ‌ర్ చేసిన క‌ర్రీలో ఎల‌క క‌ళేబ‌రం రావ‌డంతో ఒక వ్య‌క్తికి తిన్నదంతా లోప‌లి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. పంజాబ్ (Punjab) లూథియానాలోని ఒక రెస్టారెంట్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ వీడియోను స‌ద‌రు వ్య‌క్తి ట్వీట్ చేయ‌డంతో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది.

ఎన్‌సీ అనే అకౌంట్‌తో ఉన్న పోస్ట్ అయిన వీడియోలో ఓ వ్య‌క్తి త‌ను ఆర్డ‌ర్ చేసిన డిష్‌ల‌ను చూస్తున్నాడు. అంత‌లోనే ఒక నాన్ వెజ్ గ్రేవీ క‌ర్రీపై కెమేరాను ఫోక‌స్ చేయ‌గా అందులో ఎల‌క క‌ళేబ‌రం క‌నిపించింది. అంత‌టితో ఆగ‌కుండా ఆ వ్య‌క్తి చెంచాతో ఆ ఎలుక‌ను బ‌య‌ట‌కు తీసి చూపించాడు.

‘ప్ర‌కాశ్ దాబా లూథియానా.. కూర‌లో ఎలుక‌ను కూడా వ‌డ్డించారు. రెస్టారెంట్ య‌జ‌మాని ఫుడ్ ఇన్‌స్పెక్ట‌ర్‌కు లంచం ఏమైనా ఇచ్చాడా? చాలా రెస్టారెంట్‌లు ఇలానే ఉంటున్నాయి. జాగ్ర‌త్త‌గా ఉండండి’ అని స‌ద‌రు యూజ‌ర్ హెచ్చ‌రించాడు. అయితే ఈ ఆరోప‌ణ‌ను స‌ద‌రు రెస్టారెంట్ యాజ‌మాన్యం ఖండించింది. త‌మ‌ను బెదిరించేందుకే ఈ వీడియోను పోస్ట్ చేశార‌ని తెలిపింది.

ఫేస్‌బుక్‌లో వైర‌ల్ అవుతున్న మ‌రో వీడియోలో చ‌నిపోయిన జీవితో మాంసం వండార‌ని ఒక క‌స్ట‌మ‌ర్‌ హోట‌ల్ షెఫ్‌తో గొడ‌వ ప‌డుతున్నాడు. మిమ్మ‌ల్నంద‌రినీ వినియోగ‌దారుల కోర్టుకు ఈడుస్తాన‌ని స‌ద‌రు వ్య‌క్తి అంటున్న‌ట్లు ఉంది.

ఈ రెండు వీడియోల‌పై మిగిలిన యూజ‌ర్లు ప‌లు ర‌కాలుగా స్పందించారు. లూథ‌యానా రెస్టారెంట్‌లు అస‌లు శుభ్ర‌త పాటించ‌వ‌ని ఒక‌రు అన‌గా.. వాటికి లైసెన్సులు తొల‌గించాల‌ని మ‌రొక‌రు స్పందించారు.