లవ్‌స్టోరి సినిమా తర్వాత చాలా విరామం తీసుకున్న సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ( Shekar Kammula) దర్శకత్వం వహిస్తోన్న చిత్రం కుబేర (Kubera).
ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna), రష్మిక (Rashmika) వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్లు ప్రేక్షకుల్లో క్యురియాసిటీని పెంచాయి.
అయితే ఈ చిత్రం నుంచి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో బాగా హాల్‌చల్ చేస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్న ఈమూవీలో భాస్కరభట్ల రాసిన హీరో ఇంట్రడక్షన్ పాటను ధనుష్ స్వయంగా పాడినట్లు సమాచారం. చెన్నైలో ఈ పాటను రికార్డు చేశారట.
ఇక ఈ పాట హీరో ఇంట్రడక్షన్ గీతమే కానీ కొత్త శైలిలో ఉండబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో సర్ మరో ఒకటి రెండు సినిమాలలో పాట పాడిన ధనుష్ ఫస్ట్ టైం తెలుగులోనూ పాట పాడుతుండంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.