విధాత : ఎస్టీల జాబితా నుంచి లంబాడీలను తొలగించకపోతే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని ఆదివాసీల సంఘాల సమావేశం నిర్ణయించింది. ఇంద్రవెల్లిలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. ఎస్టీల జాబితా నుంచి లంబాడీలను తొలగించడంలో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. లేనట్లయితే స్థానిక ఎన్నికలు బహిష్కరిస్తమని పేర్కొన్నారు. షెడ్యూల్ కులాల హక్కుల ఐక్య కార్యాచరణ పోరాట కమిటీ, తుడుం దెబ్బ వంటి పలు ఆదివాసీ సంఘాలు నిర్వహించిన సమావేశంలో లంబాడీలను ఎస్టీల జాబితా నుంచి తొలగించేందుకు పోరాటాలను ఉదృతం చేయాలని నిర్ణయించారు.