విధాత: గత సంవత్సరం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ పుష్ప2 ది రూల్ చిత్రం వచ్చి నెల దాటినా థియేటర్ల వద్ద ఇంకా సంచలనాలు సృష్టిస్తూనే ఉంది.
సినిమా రిలీజై 35 రోజులు పూర్తైనా తెలుగుతో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు సాధిస్తుంది. తాజాగా ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 32 రోజుల్లోనే రూ.1831 కోట్ల గ్రాస్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
అదేవిధంగా ఈ ఏడాది ఇండియాలో హయ్యెస్ట్‌గా గ్రాసర్‌గా నిలిచిందని తెలిపారు. ఇదిలాఉండగా ప్రస్తుతం సంక్రాంతికి కొత్త సినిమాలు రిలీజ్ అయ్యేంత వరకు థియేటర్ల వద్ద పుష్ప2 హంగామానే కొనసాగనుంది.
దీంతో ఇండియా నుంచి కలెక్షన్ల పరంగా సెకండ్‌ప్లేస్‌లో బాహుబలి పేరిట ఉన్న రూ.1810 కోట్ల కలెక్షన్లను వెనుకకు నెట్టివేసి రెండో స్థానంలోకి వచ్చింది. కాగా ప్రస్తుతం టాప్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న అమీర్ ఖాన్ దంగల్ మూవీని రీచ్ కావడానికి పుష్ప2 సినిమా మరో రూ.239 కోట్లు సంపాదించాల్సి ఉంది.
అయితే ఇంకా చైనా, జపాన్, రష్యా దేశాలలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండడం, ఓటీటీ, శాటిలైట్ హక్కలు కలుపుకుంటే దంగల్ పేరిట ఉన్న రికార్డును త్వరలోనే అధిగమించి నంబర్‌వన్ స్థానంలో నిలుస్తుందని సినీ లవర్స్ అభిప్రాయ పడుతున్నారు.