Site icon vidhaatha

Animal: యానిమల్.. మ‌రో రెండు భాగాలు

విధాత‌: ఒక సినిమా విడుదల కాకుండానే మరో రెండు చిత్రాలను సీక్వెల్‌గా వస్తున్నాయని నిర్మాతలు చెబుతున్నారు. ఒక్కో భాగమే రెండు నుంచి మూడేళ్లు షూటింగులు జరుపుకుంటున్న రోజుల్లో, ఇలా సీక్వెల్స్ అంటూ ప్రకటించడంతో హీరోల అభిమానులు గందరగోళంలో పడుతున్నారు.

ఇదంతా ‘యానిమల్’ మూవీ గురించే. పార్ట్-1 సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా రేంజ్‌లో రూ.900 కోట్ల వసూళ్ల సినిమాగా మలిచాడు.సినిమా చివర్లో యానిమల్ 2 వస్తుందని హింట్ కూడా ఇచ్చేశాడు.

అది ఇంతవరకూ పట్టాలెక్కలేదు. అన్నీ సవ్యంగా ఉంటే వచ్చే ఏడాది చివరికి గానీ మొదలుకాదని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో నిర్మాతలు మరో బాంబు పేల్చారు. యానిమల్ 2 మాత్రమే కాదు 3 కూడా ఉంటుందని తేల్చేశారు.

మరోవైపు దీనికి ‘యానిమల్ పార్క్’ అని పేరు కూడా రణ్ బీర్ కపూర్ ప్రకటించేయడం విశేషం. కాగా ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో స్పిరిట్ సినిమా రూప‌క‌ల్ప‌న‌లో బిజీగా ఉన్న ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా ఆ సినిమా పూర్త‌యి రిలీజ్ అయ్యాక యానిమ‌ల్ పార్క్ 2028లో, యానిమ‌ల్ కింగ్‌డ‌మ్ 2031లో విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

Exit mobile version