విధాత:మన దేశంలో మరో ప్రమాదకర కరోనా వేరియంట్ వెలుగుచూసింది. నిరంతరం కోవిడ్ వైరస్ రూపాన్ని మార్చుకుంటూ విరుచుకుపడుతోంది. ఈ కొత్త వేరియంట్ భారిన పడిన వారు వారం రోజుల్లోనే బరువు కోల్పోతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఇదే వేరియంట్ ను గతంలో బ్రెజిల్ లో కూడా గుర్తించారు. రెండు కొత్త వేరియంట్లు బ్రెజిల్ నుంచి భారత్ లోకి ప్రవేశించినట్టు వైద్య నిపుణులు భావిస్తున్నారు. భారత్ లో కొత్తగా గురించిన వేరియంటుకు B.1.1.28.2.గా పేర్లు పెట్టారు.ఈ వేరియంట్ ను శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగించగా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి.
వారం చాలు
భారత్ లో కొత్తగా గుర్తించిన B.1.1.28.2.వేరియంట్ ను శరీరంలో ప్రవేశించిన వారంలోనే గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ వేరియంట్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వేరియంట్ భారిన పడిన వారు వారంలోనే బరువు కోల్పోతున్నారని తెలిపారు. యాంటీబాడీల సామర్ధ్యాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో B.1.1.28.2.వేరియంట్ ను గుర్తించినట్టు పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే B.1.1.28.2.వేరియంట్ కేసులు భారత్ లో పెద్దగా లేవని తెలిపారు.