నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహరంలో ప్రభుత్వంపై ఏపీ హైకోర్ట్ సీరియస్…
విధాత,అమరావతి : మెజిస్ట్రేట్ కోర్ట్ ఆర్డర్స్ ను రద్దు చేయాలని ప్రభుత్వం వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై రాష్ట్ర హైకోర్ట్ లో విచారణ.హైకోర్ట్, మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీసిన న్యాయస్థానం.మధ్యాహ్నం 12 గంటలకు మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించినా సాయంత్రం 6 గంటల వరకు ఎందుకు ఇవ్వలేదని కోర్ట్ ఆగ్రహం. రాత్రి 11 గంటలకు ఆర్డర్ కాపీ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసిన హైకోర్ట్
ప్రభుత్వంపై సుమోటోగా కోర్ట్ ధిక్కరణ కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశం.సీఐడీ అడిషనల్ డీజీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు నోటీసులివ్వాలని ఆదేశించిన హై కోర్ట్.
కోర్ట్ ధిక్కారం కింద వెంటనే నోటీసులు జారీ చేయాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్ట్. పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు స్పందిస్తాయని వ్యాఖ్యానించిన హైకోర్ట్.